మరో నాలుగు నెలల్లో రాష్ట్రపతి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆ స్థానంలోకి కొత్తగా ఎవరు వస్తారన్నదానిపై హస్తినలో జోరుగా చర్చ సాగుతున్నది. ప్రత్యేకించి బీజేపీ కూడా తన అభ్యర్థిని నిలిపేందుకు ఆలోచన చేస్తుండటంతో అభ్యర్థి ఎంపిక యూపీఏకు కత్తిమీద సాములా మారింది. విచిత్రం ఏమిటంటే.. అధికార యూపీఏ, ప్రతిపక్ష ఎన్డీయే కూటములు ఏవీ సొంత బలంపై అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితి నెలకొనివుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ప్రత్యేకించి యూపీలో మారిపోయిన బలాబలాలు దీనిని మరింత సంక్లిష్టం చేశాయి. దీంతో ఈ రెండు కూటములకు వెలుపల ఉన్న పార్టీల సహాయం తప్పనిసరి. ఏ కూటమి ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలన్నా.. పెక్కు పార్టీల ఆమోదం తప్పనిసరవుతున్నది. అందులోనూ ఒక పార్టీ ఒక అభ్యర్థిని వ్యతిరేకిస్తే, మరొక పార్టీ మరొక అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీనితో అభ్యర్థిపై ఏకాభివూపాయం సాధించే దిశగా ఇప్పటికే అధికార, ప్రతిపక్ష కూటములు పావులు కదుపుతున్నాయి.
తమ పార్టీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలుపుతుందని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో విపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యుడైన, వివాదరహితుడైన నేతను తెరపైకి తీసుకురావాలని యూపీఏ యోచిస్తున్నది. బీజేపీ సైతం అభ్యంతరం చెప్పలేని సమర్ధవంతమైన నాయకుడికోసం అన్వేషిస్తున్నది. పోటీకి దిగితే ఇబ్బందికర వాతావరణం నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న రీత్యా ఏకగ్రీవానికే మొగ్గు చూపుతున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రతిపాదించవచ్చన్న వాదన వినిపిస్తున్నది. కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇది వీలుకాని పక్షంలో బీజేపీ మిత్రపక్షాలను చీల్చేవిధంగా, ఎన్డీయేలోని జేడీయూ, శివసేనవంటి పార్టీలు సూచించే అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసేందుకు హామీ ఇచ్చి, తన అభ్యర్థికి ఆ పార్టీల ఓట్లు వేయించుకోవచ్చన్న వాదన విపిపిస్తున్నది.
మైనార్టీ లేదా దళిత అభ్యర్థిని నిలపడం అనేది కూడా కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. ఈ రెండు వర్గాల్లో ఒకదాని నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆత్మరక్షణలో పడతాయన్నది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తున్నది. ఈ వర్గాల అభ్యర్థిని బీజేపీ వ్యతిరేకించే పక్షంలో సమాజ్‌వాది, తృణమూల్, డీఎంకే లాంటి పార్టీలను అభ్యర్థి ఎంపికకు ముందే విశ్వాసంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. యూపీ ఎన్నికల్లో ఘనమైన విజయంతో మంచి ఊపులో ఉన్న ములాయం సింగ్‌ను మచ్చిక చేసుకుంటే తప్ప... కాంగ్రెస్ తన అభ్యర్థిని గెలిపించుకోలేదు. జనాభా, ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీని, ములాయంను కాదనే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. అందుకే ఏదిఏమైనా జైపారెడ్డిని రాష్ట్రపతి ఎన్నికల్లో నిలిపి, గెలిపించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉందన్న వాదన వినిపిస్తున్నది. ఏది ఏమైనా అధికారాన్ని కాపాడుకునేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్న కాంగ్రెస్‌కు రాష్ట్రపతి ఎన్నికలు మరిన్ని తలనొప్పులు తెస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితి బీజేపీకి, ఇతర ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఆశలు రేకెత్తిస్తాయని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more