అధిష్టానం ఛీ కొట్టిన మంత్రి .. ఇప్పుడు తెలుగుదేశం వైపు అడుగులు వేస్తున్నారు. అందుకు ముందుగా .. చంద్రబాబుతో పబ్లిక్ గానే మీడియా సహాయంతో .. మంతనాలు సాగిస్తున్నారు. అదీ కూడా అసెంబ్లీనే వేదిక చేసుకొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, మాజీ మంత్రి పి.శంకర్రావు అసెంబ్లీ లాబీల్లో పరస్పరం ముబారక్ (శుభాకాంక్షలు) చెప్పుకున్నారు! మజ్లిస్ ఎమ్మెల్యేలతో శంకర్రావు ముచ్చటిస్తుండగా, బాబు అటుగా బయటికి వెళ్తూ వారందరినీ పలకరించి కరచాలనం చేసిన సందర్భంలో అక్కడే ఉన్న మాజీ మంత్రి శంకరరావు కూడా బాబుకు శుభాకాంక్షలు చెప్పాటంతో.. అక్కడున్న వారు అవాక్కుయ్యారు.
అనంతరం శంకరరావు మీడియాతో కు కొన్ని నిజాలను బయట పెట్టడం జరిగిందని ..అక్కడున్న వారు అంటున్నారు. శంకరరావు , బాబు లు పరస్పరం ఎందుకు శుభాకాంక్షలు చెప్పుకున్నారో ఎవరికి అర్థం కాలేదు.. కానీ శంకరరావు అందరి వైపు చూస్తు.. ఈ శుభాకాంక్షలు ఎందుకో మాకే మాత్రమే తెలుసాని బాంబు పేల్చారు. శంకరావు పేల్చిన బాంబు కు విలేకరులంతా చుట్టుముట్టడంతో, బాబు ఈ మద్య తెలంగాణలో బాగా పర్యటిస్తురని అందుకే అభినందించానని శంకరరావు చెబుతున్నాడు. అంతేకాకుండా బాబుకూ, శంకరావుకు ఎన్నో పోలికలు ఉన్నాయని కూడా చెప్పాటం విశేషం. ఆ సమయంలో బాబు ముఖంలో రంగులు మారిపోయయాని మీడియా ప్రతి నిధులు అంటున్నారు.
మీడియా వారు వింటున్న సంగతి గమనించి శంకరరావు రెచ్చిపోయి బాబు నేను 1951 ఏప్రిల్ 20న గంటల తేడాతో పుట్టామని, మాకు పిల్లనిచ్చిన మామంటే పడదని కోపంతో శంకరరావు చెప్పాటంతో చంద్రబాబు చమటలు పట్టడం మొదలుపెట్టాయాని మీడియా వారు అంటున్ను. అంతేకాకుండా వీరి తోడుగా ‘ఈనాడు’ రామోజీరావుతో ఎంతో కాలంగా సంబంధం ఉందని రామోజీరావు మా శ్రేయోభిలాషి, ఆనందంతో చెప్పాటం మొదలు పెట్టాడు. శంకరావు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత రామోజీ స్వయంగా ఇంటికి పిలిచి విందు ఇచ్చారని గొప్పగా చెబతున్నాడు. అయతే తాజాగా రామోజీని కలుద్దామనుకోని ఆయన కోసం వెళితే ఆయన తీర్థయాత్రలకు వెళ్లి పోవటంతో శంకరరావు కోరిక తీరలేదని చెబుతున్నాడు.
‘కాంగ్రెస్ అధిష్టానం (అమ్మ) వద్ద రాష్ట్రం నుంచి ఇద్దరికే పలుకుబడి ఉంది. అందులో నేనొకడిని. మరొకరు వ్యాపారవేత్త అని శంకరరావు చెబుతున్నారు.రాష్ట్రంలో చినబాబు (జగన్), పెదబాబు (చంద్రబాబు) మధ్యే పోటీ ఉంటుందని మొగ్గు చినబాబు వైపే ఉంటుంది. రెండోస్థానంలో చంద్రబాబుంటారు. కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారిపోయిందని మాజీ మంత్రి అంటున్నారు. రాష్ట్రంలోని దళితులు, క్రైస్తవుల ఓట్లన్ని జగన్‌కే పడతాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రజలకు ఎవరు సరైన అవగాహన కల్పిస్తే వారికే మెజారిటీ స్థానాలు దక్కుతాయి’’ అని శంకర్రావు జోస్యం చెప్పారు! టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనకు మంచి మిత్రుడని, కానీ ఆయన బాల్ ఠాక్రేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more