జగన్ పార్టీని కాంగ్రెస్ లో కలుపుతున్నాడా? అంటే అవుననే వార్తలు కాంగ్రెస్ వర్గాలలో వినిపిస్తున్నాయి. జగన్ కూడా ఒక వైపు నుండి అధిష్టానంతో.. మంతానలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల జగన్ ఢీల్లీలో ..అహ్మద్ పటేల్ తో కలిసి కొన్ని గంటల పాటు .. పార్టీ విషయాలు గురించి మాట్లాడినట్లు ఢిల్లీ ప్రతినిధులు అంటున్నారు. అంతే కాకుండా .. కాంగ్రెస్ నాయకులు కూడా .. జగన్ పై ఎలాంటి విమర్శలు చేయకుండా.. చాలా జాగ్రత్త పడుతున్నారు. అంటే జగన్ పార్టీని ఎలాగైన కాంగ్రెస్ లో కలుపుకోవాలనే ఉద్దేశం వారిలో కనబడుతుందని ప్రజలు అంటున్నారు.
వైఎస్ చనిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి .. బయటికి పోయి జగన్. కొత్త పార్టీ పెట్టి .. కాంగ్రెస్ కు నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే. అది మనస్సులో పెట్టుకున్న అధిష్టానం.. జగన్ పార్టీని .. పీఆర్పీ పార్టీని కలుపుకున్నట్లే .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా .. కలుపుకోవాలనే ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుస్తుంది. అసలు జగన్ వల్ల కాంగ్రెస్ నష్టం ఏమిటి? జగన్ తో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దెబ్బతిట్టుందా? జగన్ వల్ల కాంగ్రెస్ కు లాభాం ఏమిటి? అసలు జగన్ ను అధిష్టానం ఎందుకు కలుపుకోవాలని ఉంది? అనే ప్రశ్నలు సామాన్య ప్రజల మనస్సుల్లో తిరుగుతున్నాయి.
రాబోయే ఎన్నికల వలన కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు. అదీ కూడా జగన్ వలనే జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందువలన ముందుగానే జగన్ ను కాంగ్రెస్ పార్టీ లో కలుపుకోవాలని ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
2014 ఎన్నికల వలన జగన్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను చీల్చటం ఖాయమని అందరికి తెలిసిందే. అందువలన జగన్ పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి.. జగన్ కు ఏ అవకాశాలు లేకుండా చేసి... చివరకు జగన్ పార్టీని కాంగ్రెస్ లో కలిపితే.. జగన్ పై ఉన్న కేసులు అన్ని ఎత్తివేశామనే .. ఆశ చూపించి.. పార్టీని విలీనం చేసే విధంగా అధిష్టానం విదేశీ కేసులను కూడా జగన్ పై పెట్టడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఈ ఒత్తిడి వలన జగన్ ఏం చేయ్యలేని పరిస్థితి కల్పించి .. కాంగ్రెస్ వైపు అడుగులు పడేలా చేయ్యటం కోసం అధిష్టానం ప్రయత్నాలు చేస్తుందని సీనియర్ నాయకులు అంటున్నారు. అంతే కాకుండా ఒక వైపు ఒత్తిడి తెస్తునే.. మరో వైపు.. జగన్ పై ప్రేమ చూపిస్తుందని నాయకులు అంటున్నారు.
జగన్ కూడా .. కాంగ్రెస్ పార్టీలో కలవాటానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో.. జగన్ తన పార్టీ విషయాలలో .. చాలా మందకోడిగా కనిపిస్తున్నాడని మీడియా ప్రతినిధులు అంటున్నారు. తన పార్టీ కార్యక్రమాలకు జగన్ దూరంగా ఉంటునట్లు తెలుస్తుంది. ఆ విషయం గమనించిన అధిష్టానం .. జగన్ పైకి మరళ సీబీఐ వేట ప్రారంభించిందని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంటున్నారు.
జగన్ ఆస్తుల కేసులో తవ్వేకొద్దీ కొత్తకొత్త విషయాలు, కొత్తకొత్త సంస్థల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ఆరునెలలుగా ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సీబీఐ తాజాగా ఏడు విదేశీకంపెనీలను కూడా తప్పనిసరిగా విచారించాలని నిర్ణయించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మరింత విస్తృతమైన దర్యాప్తు అవసరం అని సీబీఐ నిర్ధార ణకు వచ్చింది. ముఖ్యంగా వివిధ దేశాల్లోని ఏడు కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలలోంచి జగన్ గ్రూప్ సంస్థలకు పెట్టుబడుల రూపంలో భారీగా నిధులు జమఅయ్యాయని వాటిపై సదరు కంపెనీల యాజమాన్యా లను కూడా విచారించాలని సీబీఐ నిర్ణయించుంకుంది. భారతదేశ చరిత్రలో ఒక రాజకీయవేత్త కుమారుడి ఆస్తుల కేసులో సీబీఐ విదేశాలలో కూడా దర్యాప్తు జరపడం ఇదే ప్రపధమం అని చెప్పవచ్చు.
మారిషస్‌లోని మాయదారి కంపెనీలు... లక్సెంబర్గ్‌లో పుట్టి పని పూర్తికాగానే గిట్టిన సంస్థలు... దుబాయ్ నుంచి దండిగా కురిసిన కాసులు... సింగపూర్ కంపెనీలతో సీక్రెట్ లింకులు! జగన్ మాయామేయ సామ్రాజ్యానికి ఎన్నెన్ని దేశాల్లోనో మూలాలు! ఈ లింకులు ఛేదించేందుకు సీబీఐకి మార్గం సుగమమైంది. జగన్ అక్రమాస్తుల కేసులో విదేశాల్లో వేట మొదలుకానుంది. దీనికి అవసరమైన 'లెటర్ ఆఫ్ రొగేటరీ'ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నుంచి పొందింది. దీంతో సుమారు ఆరు దేశాల్లో జగన్ లావాదేవీలపై ఆరా తీసేందుకు సిద్ధమవుతోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more