అది అసెంబ్లీ.. అక్కడ అంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఉంటారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులు సమావేశమైన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కంటే.. కామెడీ డైలాగ్ ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు. అక్కుడున్న మంత్రులు , ఎమ్యెల్యేలు.. ప్రతిపక్ష నాయకులు, కలిసి ఒకరి మీద ఒకరు జోకులు , వేసుకుంటు.. హాయిగా నవ్వుకుంటున్నారు.
కాంగ్రెస్ ఎ మ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. రంగు రంగుల పేపర్లపై ఆంగ్ల సామెతలు, వాటికి తెలుగు అర్థాలు రాసుకొచ్చి.. ఆ సామెతలను టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు అన్వయించారు. ప్రసంగం మొదలు పెట్టగానే.. సోనియా, మన్మోహన్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. 'రాహుల్‌ను పొగడలేదేం?' అని టీడీపీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ వ్యంగ్యంగా ప్రశ్నించగా, "రాహుల్‌ని కూడా పొగుడుతా.. లేకపోతే ఎన్టీఆర్, బుడ్డ ఎన్టీఆర్, బాలకృష్ణను పొగడాలా? ఇట్టాగైతే ఎట్టా పంతులూ...'' అని అనడంతో నవ్వులు పూశాయి.
పదేళ్లనాటి బడ్జెట్‌కు ఇప్పటి బడ్జెట్‌కు మేరు పర్వతానికి ఆవగింజకు ఉన్నంత తేడా ఉందన్నారు. 'అందులో వెతకడానికి ఏమీలేకే ప్రతిపక్ష నేత ఈ సేవ... మీ సేవ అంటూ ఒక్క ఆవగింజను పట్టుకొని పోపెట్టుకొంటున్నారు' అంటూ వ్యంగ్య బాణాలు విసిరారు. అనంతరం ప్రతిపక్ష సభ్యుల వైపు చూస్తూ 'ప్రజా తిరస్కృతులు.. కళ్లుండి చూడలేని కబోదులు.. తమపై తమకే నమ్మకం లేని నాస్తికులు..' అంటూ పేపర్ చదవడం మొదలెట్టారు. దీనిపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. స్పీకర్ పొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డికి మైక్ ఇచ్చారు. 'వివేకానందరెడ్డి మంచి డ్రామా ఆర్టిస్టు.. చింతామణి నాటకంలో డైలాగులు చెబుతున్నట్లు ఉంది.
ఎక్కడ రాయించుకొచ్చారో?' అని ఎద్దేవా చేశారు. దాంతో ఆనం వెంటనే.. 'మీకు తెలుగు ట్రస్టు భవన్‌లో రాసిచ్చినట్లు మాకెవ్వరూ రాసివ్వరు.సొంతంగా రాసుకొచ్చా' అని చురకలంటించారు. నెపోలియన్ చెప్పిన ఓ ఆంగ్ల సామెతను ఆనం చదవగా.. 'దానికి అర్థం తెలుసా?' అంటూ టీడీపీ సభ్యులు సెటైర్ వేశారు. 'మీరు ఇట్టా అడుగుతారనే తెలుగులో అర్థం రాసుకొచ్చా, ' అనటంతో సభ నవ్వులతో ఘుెల్లుమంది. 'ఒలింపిక్‌లో సెకండ్ వచ్చిన వారికి సిల్వర్ కప్ ఇస్తారట? రాజకీయాల్లో రెండోసారి గెలిచినవాళ్లు సమస్యలు మరిచిపోతారట?' అనగా, 'ఒలింపిక్‌లో ఇచ్చేది కప్పుకాదు మెడల్ ' అని టీడీపీ సభ్యుడు పల్లె రఘునాథ రెడ్డి, 'మీరు ఎన్నోసారి గెలిచారు' అని ధూళిపాళ్ల స్పందించారు.
అదే సమయంలో స్పీకర్ బెల్ మోగించి త్వరగా ముగించండి అనడంతో.. 'వాళ్లు డిస్ట్రబ్ చేస్తారని ఊహించే తప్పుపోకుండా పేపర్లో రాసుకొచ్చా. మీరు బెల్ కొడితే ఎట్టా..సరిగా చెప్పలేను' అంటూ ఆనం మరోసారి నవ్వులు పూయించారు. 'ఇది తెలుగు వారి సభ. గురజాడ సామెతలు చాలా ఉన్నాయి. వా టిలో ఒక్కటైనా చెప్పలేదేం' అని రావుల సెటైర్ విసిరారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more