నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోనూ, మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల లోనూ అంబేద్కర్ విగ్రహాలకు నష్టం కలిగించారు. విగ్రహ పరిరక్షణకు నియమించిన విఆర్ఏ ని కలెక్టర్ బాబు సస్పెండ్ చేసారు. తాడేపల్లి గూడెం పోలీస్ స్టేషన్ కి దగ్గర్లోనే ఉన్న అంబేద్కర్ విగ్రహం తలని ఎవరో తొలగించారు, ఆ చర్యను అందరూ ఖండించారు. అయినా దళిత వర్గాలు తలవంపులుగా భావించి భగ్గుమన్నాయి.
దెబ్బ కొట్టేవారు ఎక్కడ కొడితే బాధ కలుగుతుందో అక్కడే కొడతారు. బాధ కలిగితే వారు జయం సాధించినట్టు, బాధ కలగకపోతే వారు ఓడిపోయినట్లే. అంటే వీరికి కలిగే బాధే వారి విజయం. ఇది మానసిక వేదనలకు బాగా వర్తిస్తుంది. అవమానపరచటం, మానసికంగా బాధించటం, డిస్టర్బ్ చెయ్యటం, విసుగు కలిగించటం, ఆందోళన కు గురిచెయ్యటం ఇవన్నీ మానసిక వేధింపులే. కానీ వాటికి గురైనవారు సహకరిస్తేనే వాటికి గురిచేసినవారు వారి ప్రయత్నంలో సఫలమైనట్టు. ఎవరో ఏదో అన్నారని మనసులో పెట్టుకుని బాధపడటమనేది చెయ్యకపోతే అవతలివారు ఓడిపోయినట్లే. ఎవరూ డిస్టర్బ్ చెయ్యలేరు. అది డిస్టర్బెన్స్ గా వీళ్ళు క్వాలిఫై చేస్తే తప్ప.
పార్టీకి వెళ్తే పట్టించుకోలేదు, లేదా వీరి డిగ్రీలు, వృత్తిలో ఉన్న ఉన్నత స్థాయిని గుర్తించి గౌరవించలేదు అంతే, వీరికి కోపం, ఆవేశం, పట్టింపులు, మానసిక వేదన మొదలవుతాయి. వీరే కాస్త ఆలోచించి వాళ్ళు ఎందుకలా చేసుంటారని ఆలోచిస్తే, బయట కనిపించే కారణాలు వేరు వేరుగా ఉండవచ్చు కానీ, అన్ని సందర్భాల్లోనూ మౌలికమైన కారణం ఒకటే- వీరిని బాధించటం, వీరి మనసుని గాయపరచటం. వీరే గనక దాన్ని పట్టించుకోకపోతే, బాధపడకపోతే, మనసులో పెట్టుకుని వ్యథ చెందకపోతే, అవతలి వారు విఫలమైనట్టే కదా. అంటే, బాధపడి అవతలివారిని గెలిపిస్తున్నారు. అవతలివారి గెలుపు ఓటమిలు మన చేతిలో (మనసులో) నే ఉన్నప్పుడు మనం వారిని గెలవనివ్వటం ఎందుకు. చిన్నపిల్లల విషయంలో చేసినట్టు వారిని గెలిపించాలన్న సంకల్పమున్నా సరే బయటకు అలా ప్రదర్శించవచ్చుకానీ, నిజంగా వ్యథలకు లోనవటమెందుకు.
నిగ్రహాలను కలిగివుంటే విగ్రహాలనెవరూ ఏమీ చెయ్యరు. అంబేద్కర్ స్పూర్తి ఉండాల్సింది మనసులో. కృతఙతతో నిండిపోవలసింది హృదయం. దాన్ని ఎవరు చెరపగలరు. అక్కడి ప్రతిమను ఎవరు ధ్వంసం చెయ్యగలరు. అంబేద్కర్ విగ్రహాలను ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో వారు ఎవరైనా కానీ, వారికి దళితులను ఎలా రెచ్చగొట్టాలో బాగా తెలుసన్నమాట. వారి పన్నాగాలను తిప్పికొట్టాలంటే ఆవేశపడకపోవటమే మందు. ఈ సూక్ష్మాన్ని తెలుసుకున్నరోజున, బహిరంగంగా చేసే దానికి దేనికీ స్పందించని రోజున అలా చెయ్యటం వలన ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి, ప్రయోజనం లేని పని ఎవరూ చెయ్యరు కాబట్టి, అలాంటి పనులు జరగవు.
ఒకసారి జనక మహారాజు రాజ్యసభకు మునివర్యులు అష్టావక్రులవారు వస్తున్నారని తెలిసి, వారిని చూడటానికి నగరంలోని ప్రజ పోగయిందట. ఆ ఘడియ రానే వచ్చింది. అష్టావక్రులవారు సభలోకి ప్రవేశించారు. ఆయన పేరుకి తగ్గట్టుగానే ఎనిమిది వంకర్లతో ఉన్న ఆయన శరీరాన్ని చూడగానే సభలోని వారంతా ఫక్కుమని నవ్వకుండా ఉండలేకపోయారట. వారితో పాటు అష్టావక్రులవారు కూడా పకపకా నవ్వేసారట. సద్దు మణిగింది, ఆయన మహాత్యమేమిటో అందరికీ తెలిసింది, అంతా అయిపోయింది. సభ ముగిసింది.
ఆ తర్వాత జనక మహారాజు అష్టావక్రులను అడిగారట, స్వామీ జనమంతా మిమ్మల్ని చూసి నవ్వారంటే అర్థముంది. కానీ మీరెందుకు నవ్వారు అని అడిగారట. దానికి ఆయన, వారి అమాయకత్వానికి అన్నారట. శరీరమే వ్యక్తి కాదు. వ్యక్తిని గుర్తించటానకి ఉన్నదే శరీరం కాని, శరీరాన్ని బట్టి గుర్తింపు రావటానికి కాదు. గురువు అంటే ఆయన శరీరం కాదు. తల్లి అంటే ఆమె శరీరమే అయినట్లయితే ఆమెను చూసినవారందరికీ అదే భావన కలగాలి, అందరికీ ఆమె దగ్గర సురక్షితా భావం కలగాలి. కానీ అలా కలగదే. కాబట్టి శరీరం కాదు వ్యక్తి అంటే. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోలేక పోయిన అమాయక ప్రజలను చూసి నవ్వు వచ్చింది అష్టావక్రులవారికి.
శరీరమే వ్యక్తి కానప్పుడు, ఆ శరీరమే పోయి ఙాపకాలు, వారి కీర్తి ప్రతిష్టలే మిగిలి ఉన్నప్పుడు విగ్రహాలు ఏపాటి అని అనుకుంటే గొడవలకు ఆస్కారమే ఉండదు కదూ. ఇది చెప్పటం తేలికే. కానీ ఆచరించటం కష్టమని తెలుసు. ఎందుకంటే మాస్ సైకాలజీ బాగా తెలిసినవారు చాలా మంది ఆ పని జరగనివ్వరు. కానీ ప్రయత్నం చేద్దాం. సాధనతో సాధించలేనిదేమీ లేదు కదా. సాదింపులకు గురిచేసేవారికి అదే మంచి మందు. బాధపడకపోవటం, ఆ విధంగా వారిని ఓడించటం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more