సీబీఐ కెమెరా కన్ను పడిన ప్రతి నాయకుడు, ఏం చేయ్యలా తెలియాకు చివరకు దేవుళ్లుని మొక్కుతున్నారు. వివాదాల్లో కూరుపోయిన రాజకీయన నాయకులు తమ కుల దైవాలకు మొక్కులు తీర్చుకుంటున్నారు. మొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మీ తిరుపతి వెంకంటేశ్వర స్వామిని మొక్కుకుంటే, నిన్న ఎమ్మార్ కేసులు అరెస్టైన ఆచార్యం.. ఆయన కుల దైవం అయిన ఆంజనేయ స్వామిని మొక్కుకున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా మంత్రి మోపిదేవి అరసవల్లి లో మొక్కులు తీర్చుకున్నాడని తెలిసింది. మోపిదేవి ఆయన గురించి మొక్కులు తీర్చుకోలేదట. ముఖ్యమంత్రి పరిపాలన సుబిక్షంగా ఉండాలని మొక్కులు తీర్చుకున్నానని చెప్పటం మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారని చెబుతున్నారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ శ్రీకాకుళం జిల్లాలోని అరవవల్లి సూర్యదేవుడిని దర్శించుకున్నారు. ఆయన ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశారు. తనకు గ్రహాల అనుకూలత లేకపోవడం వల్లనే సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల మంత్రి మోపిదేవిపై మద్యం సిండికేట్ల విషయంలో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్ సిండికేట్ రమణ వాంగ్మూలంతో మోపిదేవి పేరును ఎసిబి రిమాండ్ రికార్డులోనూ చేర్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తనకు గ్రహాల అనుకూలత బాగా లేదని భావించి సూర్య దేవుడికి ప్రత్యేక పూజలు చేసినట్లున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన గంటకు పైగా దేవాలయంలో గడిపారు. మద్యం సిండికేట్లపై విలేకరులు ప్రశ్నించగా మాట్లాడటానికి ఇష్టపడలేదు.
వీరందరు వివాదాల్లో కూరుకుపోతున్న వారంతా ఆదిత్యుని శరణు కోరుతున్నారు. ఆదుకోమని వేడుకుంటున్నారు. తాజాగా, ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరసవల్లి వచ్చి ఆదిత్యుని దర్శించుకున్నారు. మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి మోపిదేవికి రూ.10 లక్షల లంచం ఇచ్చానని మద్యం వ్యాపారి రమణ వాంగ్మూలం ఇవ్వడం, వరంగల్ ఏసీబీ అధికారులు దానిని తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో, మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.
మంత్రి మోపిదేవి అరసవల్లి ఆదిత్యుని సన్నిధిలో ప్రత్యక్షమయ్యారు. ఆయనతోపాటు ఆయన బంధువులు ఇద్దరు, విశాఖపట్నం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు ఉన్నారు. ఇంద్ర పుష్కరిణి వద్ద సూర్య నమస్కారాలు చేసి, ఆ తర్వాత ఆయన సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. అక్కడ ఫొటోలు తీయబోయిన మీడియా ప్రతినిధులను ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. సీఎం కిరణ్ పాలన సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు.
కాగా, ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్‌కు అక్రమంగా అనుమతులు కట్టబెట్టిన కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొనే సమయంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గత ఏడాది నవంబర్ 20న అరసవల్లి వచ్చి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిన వెంటనే ఆమె అరెస్టయ్యారు. ఆ తర్వాత ఎమ్మార్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కూడా అరసవిల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కొద్ది రోజులకు ఆయన కూడా జైలుకు వెళ్లారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more