బాలయ్య తన బావ సారధ్యంలో .. రాజకీయాల్లోకి దూసుకువస్తున్నాడు. ఒక పక్క సినిమాలు చేస్తునే తన రాజకీయా జీవితానికి పునాదులు వేస్తున్నారు. తెలుగు దేశం పార్టీని ముందు నడిపించడం కోసం బావ తో సహా బాలయ్య పార్టీ విషయాలను సున్నితంగా పరిశీలించటం జరుగుతుందట. మొదటిగా బాలయ్య ఎన్టీఆర్ భవనంలో కొత్త మార్పులు , వాస్తు లోపాలను సరిచేయటంతో బాలయ్య పేరు పార్టీ ఆఫీసులో బాగా వినిపిస్తుందట.
అయితే బాలయ్య రాకతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులలో కొంత మందికి ఆనందం, మరొ కొంతమంది బాధగా ఉందట. భాలయ్య పార్టీలో ఉంటే తమ పదవులకు నష్టం జరుగుతుందని కొందరు భయపడుతున్నారట. ఆ భయపడే వారే బాలయ్యను ఎలగైన పార్లమెంట్ కు పోటీ చేయించాలని చూస్తున్నరట. అదే మనస్సులో పెట్టుకొని బాలయ్య అసెంబ్లీ కంటే .. పార్లమెంట్ లో ఉంటే బాగుంటుందని బాలయ్య సన్నిహితుల ద్వారా మీడియ ముందు బాలయ్య చేత చెప్పించాలనే ఆలోచనలో ఉన్నారట.
ఇప్పుడు అందరిలోను బాలయ్య ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? ఒక వేళ పోటీ చేస్తే అసెంబ్లీకా? లేక పార్లమెంట్ కా? అనే ప్రశ్నలు బాలయ్య అభిమానుల మనస్సులో ఉద్బవిస్తున్నాయాట. అసలు బాలయ్య పార్టీలో రావటం పార్టీ కే నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి బాలయ్య ఒక్కడి వల్ల బలం రాదని, తన కుటుంబ సభ్యులను కలుపుకోని పోతే తెలుగు దేశం పార్టీ బలపడుతుందని రాజకీయ విశ్లేషకుల ఆలోచనట.
బాలయ్యను చూసుకోని చంద్రబాబు కూడా ఒంటెద్దు పోకడ మంచిది కాదని అంటున్నారు. అంటే బాలయ్య ఒక్కడినే తెలుగు దేశం పార్టీలోకి తీసుకొని , ఎప్పటి నుండో పార్టీకి బాబు కు అనుగుణంగా ఉంటున్నా హరి కృష్ణ ను, 2009 లో తెలుగు దేశం పార్టీ తరుపున చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయ్యాలని తన షూటింగ్ లను ఆపుకోని పార్టీ ప్రచారం కోసం వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను కూడా దూరం చేసుకోవటం ర్టీకి భారీ నష్టమే జరుగుతుందని తెలుగు దేశం ఎన్టీఆర్ తో పని చేసిన సీనియర్ నాయకులు అంటున్నారు.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి అయిన తరువాత నుండి పార్టీకి, చంద్రబాబు కి దూరంగా ఉంటున్నాడట మాటలు వినిపిస్తునే ఉన్నాయి. అదీ గాక ఎన్టీఆర్ పెళ్లిలో చంద్రబాబుకు ఎన్టీఆర్ నమస్కారించలేదని, అప్పుడే నుండి బాబు ఎన్టీఆర్ పై శ్రద్ద తగ్గించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. హరికృష్ణ కూడా బాబు కోపంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అభిమానుల గొడవలే కారణం అని మనకు తెలిసిందే.
నిన్న ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా అందరి కంటే ముందుగా ఎన్టీఆర్ ఘాట్ ను జూనియర్ ఎన్టీఆర్, హరి కృష్ణ లు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు ఆర్పించి వెళ్లి పోయారట. ఆ తర్వాత చంద్రబాబు , ఆయన సతీమణి , కూమారుడు లోకేష్ బాబు, బాలయ్య కుటుంబం కలిసి వచ్చి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు ఆర్పించారట. ఈ సన్నివేశాలను చూసిన పార్టీ పెద్దలలో కొత్త భయం పట్టుకుందట. వీరు ఇలా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో పార్టీకి తీరాని నష్టం జరుగుతుందని వారు అంటున్నారు.
పెద్ద ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన ఒక సీనియర్ నాయకుడు .. వీరు ఇలా ఆవేశంగా ఉండటం వలన ఏమి లాభం లేదని, ఏలాంటి వయస్సు వారికి అలాంటి ఆలోచనలను దేవుడు ఇస్తాడని , అంతేగానీ జూనియర్ ఎన్టీఆర్ ఆవేశంగా పార్టీ పగ్గాలను తీసుకుందామనే ఆలోచన చాలా పోరపటని, ఆయన ఆవేశంగా అన్నారట. సీనియర్ ఎన్టీఆర్ అనుభవాలతో ఆయనకున్న సంబందాన్ని గుర్తు చేస్తు అన్న మాటలివి. ఏ వయస్సులా వారికి ఆ వయస్సు అనుభవం , ఆలోచనలు , వ్యక్తితత్వంను గుర్తు చేస్తాయని చెప్పారట.
అయితే బాలయ్య కొన్ని సంచలన ప్రకటనలు మీడియా ముందు చేశారట. రాబోయే ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ కన్పిస్తాడా? అంటే ... బాలయ్య ముక్కసూటిగా అదే వారి ఇష్టం , ప్రజలకు సేవ చేయాలనే ఉన్నావారు ఎవరైన ఎఫ్పుడైన పార్టీలోకి రావచ్చు. అంటే ఎన్టీఆర్ పార్టీలోకి రావచ్చు? రాకపోచ్చు? అనే చిన్న నవ్వు నవ్వేరట. హరి కృష్ణ పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు అంటే? ఆయన చాలా బిజీగా ఉన్నడని బాలయ్య చెప్పాటం అక్కడ అందరిని ఆశ్చర్యపరిచిందట.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని నందమూరి బాలకృష్ణ ప్రకటించాడు. బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం మారిందట.. బాలకృష్ణను వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారట. ముందుగా బాలయ్యను పార్లమెంట్ పోటీ చేయాల్సింగా కొందరు సీనియర్ నాయకులు కోరట. అందుకు పోటీగా లగడపాటి రాజగోపాల్పై పోటీకి పెడితే బాగుంటుందనే ఆలోచనలు పార్టీలో షికార్లు చేస్తున్నారట. ఆ పుకార్లు .. ఆనోట ఇనోటు .. తిరుగుతూ బాలయ్య చెవిని తాకయాట.
నేను పార్లమెంటుకు పోటీ చేయ్యను . నేను పోటీ చేస్తే .. అసెంబ్లీకే పోటీ చేస్తానని మీడియా ముందు బల్లగుద్ది మారి చెప్పాడట. బాలయ్య చెప్పటంతో .. తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుల్లో సరికొత్త భయం పట్టుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య అసెంబ్లీ కే ఎందుకు పోటీ చేస్తారంటే .. దాని వెనక పెద్ద రహస్యం ఉందట. అంటే మెగా స్టార్ చిరంజీవి పార్టీ పెట్టి, తిరుపతి ఎమ్మెల్యేగా గెలిసి, తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసి, రాష్ట్ర రాజకీయాలను బాగా తెలుసుకోని, కాంగ్రెస్ లో పెద్ద నాయకుడిగా పేరు తెచ్చుకున్నడని పరోక్షంగా బాలయ్య మీడియా ముందు బయటపడ్డడట, అందుకే చిరు మీద పోటీగా శాసనసభకు మాత్రమే పోటీ చేస్తారట అని మీడియా వారు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more