పవన్‌కల్యాణ్, పూరి జగన్నాథ్‌ల తొలికలయికలో ‘బద్రి’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. 2000 సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైన ఈ చిత్రం ద్వారానే పూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ చిత్రం సంచలన విజయం సాధించి దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఈ సినిమా వచ్చి దాదాపు పన్నెండేళ్లు పూర్తవుతుంది. వీరిద్దరి మలి కలయికపై అభిమానులు గతకొంత కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం పూరి, పవన్ కాంబినేషన్‌లో త్వరలో ఓ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహేష్‌తో ‘బిజినెస్ మేన్’ చిత్రాన్ని రూపొందించి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న పూరి జగన్నాథ్ త్వరలో తనను దర్శకుడిగా పరిచయం చేసిన పవన్ కల్యాణ్‌తో ఓ భారీ చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. పన్నెండేళ్ల తర్వాత పవన్‌కల్యాణ్‌తో చేయనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పూరిజగన్నాథ్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో తెలిపాడు.
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ ఈ మధ్యే పవన్‌కళ్యాణ్‌ను కలిసాను. మేమిద్దరం కలిసి ఓ భారీ చిత్రం చేయబోతున్నాం. ఆ చిత్రం త్వరలో సెట్స్‌పైకొస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను’ అన్నారు. త్వరలో ‘బిజినెస్ మేన్’ హిందీ రీమేక్‌తో పాటు రవితేజతో ‘ఇడియట్’ సీక్వెల్‌కు దర్శకత్వం వహించనున్న పూరి జగన్నాథ్ ఈ బిజీ షెడ్యూల్‌లో పవన్ చిత్రానికి ఎలా డేట్స్ సర్ధుబాటు చేసుకుంటాడో చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more