సినిమా అనేదే ఒక ఆకర్షణ. జనాలని ఆకర్షించడం కోసం దర్శక నిర్మాతలు ఎన్ని పాట్లు పడతారు... సినిమా మొదలు పెట్టిన దగ్గరినుండి రిలీజ్ అయ్యే వరకు తమ సినిమా నలుగురి నోళ్ళలో నానాలని అన్ని రకాలుగా ప్రచారం చేస్తారు. ఇందులో భాగంగానే, అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పూరాతన సన్నివేశాలు, ఐటం సాంగ్ లు, అవసరం ఉన్నా లేకపోయినా విదేశాలలో సినిమా చిత్రీకరణ, ఇలాంటివి ఇంకెన్నో చేస్తుంటారు. కొన్ని ఫలిస్తాయి, మరి కొన్ని బెడిసి కొడతాయి. మరి ఈ మధ్య కాలం లో హీరో హీరోయిన్ పెదాలను కెమెరా సాక్షిగా ముద్దాడటం అనేది ఒక అలవాటుగా అయిపొయింది ఇంచు మించు ఎక్కువ శాతం సినిమాలల్లో. అల్లు అర్జున్ ఇందులో ముందు వరుస లో ఉన్నాడు. ఆర్య - 2 ఇంకా వరుడు సినిమాల్లో తన హీరోయిన్లని ముద్దాడాడు అర్జున్. అయితే పెళ్లి చేస్కున్న తరువాత, ఇక మీదట ఇలాంటి సన్నివేశాలలో నటించనని తీల్చి చెప్పేసాడు, బన్నీ. ఇక ముద్దు సన్నివేశం తో వెలుగులో కొచ్చిన మరో హీరో ప్రిన్స్ మహేష్ బాబు... అతడు సినిమాలో త్రిష ని సున్నితంగా ముద్దాడాడు... అయితే ఈ సారి, ఘాడ చుంబన సన్నివేశం లో నటించాడట... మరి ఈ సన్నివేశం చూడటం కోసం జనవరి 11 వరకు ఆగాల్సిందే. అవునండి, మహేష్ - పూరి జగన్నాథ్ ల బిసినెస్ మ్యాన్ లో హీరోయిన్ కాజల్ తో ముద్దు సన్నివేశం లో మహేష్ నటించాడని, అయితే కధ డిమాండ్ చెయ్యడం వల్లనే ఈ సన్నివేశం చిత్రీకరించవలసి వచ్చిందని, ఈ సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు.
కానీ సినిమా డిమాండ్ చేసిందని ముద్దు సన్నివేశాలు, ఐటం సాంగు పెట్టడం సమంజసమేనా? అసలు ఏ కధ అయినా కధనం మీద ఆధార పది ఉంటుంది. ఒక సన్నివేశం నుండి ఇంకొక సన్నివేశానికి కధని ఎలా తీసుకువెళతారో ముఖ్యం... అంటే కాని, చుంబన సన్నివేశాలు కధకు ఏ విధంగా ఉపయోగపడతాయి? సరే, ఈ ప్రశ్నకి తమదైన శైలి లో జవాబిచ్చే సినీ పండితులు ఎందరో ఉన్నారు... ఏమైతేనేం, బిసినేస్సమ్యాన్ కోసం మహేష్ తన వంతు కృషి చేసాడనే చెప్పాలి. ఎన్నడు లేని విధంగా ఈ సినిమా పాటలో తన స్వరం కలిపాడు, కాజల్ పెదాలని ముద్దాడాడు... మరి మహేష్ భార్య నమ్రతకి ఈ విషయం తెలుసో లేదో.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more