రాజకీయాల్లో ఎవరూ ఎవరితో కలవరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అవసరం కోసం ఎవరికైనా మద్దతునిచ్చినా ఆ అవసరం తీరిపోగానే మళ్ళీ ఎవరికి వారే. అదే లేకపోతే ఇన్ని పార్టీలు ఎందుకు వెలుస్తాయి.
కాంగ్రెస్ పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెరాస కలిసిపోయి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో బలహీన పరచటానికి చూస్తున్నాయని తెదేపా వాదన.
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయి తెలంగాణా రాకుండా చేస్తున్నాయని, రాష్ట్రాన్ని వారిష్టానుసారం ఏలుతున్నారని తెరాస అనుమానం.
తెరాస, వైయస్ ఆర్ కాంగ్రెస్ కలిసిపోబట్టే జగన్ ఓదార్పు యాత్రకు అడ్డు పెట్టబోవటం లేదని, ఉప ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ.
కడపలో ఉప ఎన్నికల సమయంలో తెదేపా, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు కలిసిపోయాయని కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శ వచ్చింది.
ఒక పార్టీ లోనే కలిసి మెలిసి పనిచెయ్యటం కష్టమై అధిష్టానానికి ఎన్నో తలనొప్పులు వస్తున్న తరుణంలో ఒక పార్టీ మరో పార్టీకి మద్దతునివ్వటం కేవలం ఒట్టి అనుమానమే అవుతుంది.
అన్ని రాజకీయ పార్టీలూ కలిసి చేసేది ఒక్కటే- రాజకీయం. పార్టీ ప్రయోజనమే లక్ష్యంగా పథకాలు వెయ్యటం, ప్రకటనలు చెయ్యటం, ప్రతిపక్షాల మీద ఆరోపణలు వెయ్యటం.
ఈ నేపథ్యంలో బాహాటంగా, మేము కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నామని ధైర్యంగా చెప్పి, ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవికి నిజంగా రాజకీయం తెలియదనే అనాలి. పైకి ఆరోపణలు చేస్తూ వెనక నుంచి మద్దతు నిచ్చే పని చెయ్యలేదు. లేదా తన పార్టీని పాలక పక్షానికి మిత్ర పక్షంగా ప్రకటించి, ప్రభుత్వాన్ని అవసరమైనప్పుడల్లా బెదిరించే పనికీ పోలేదు.
చిరంజీవి నాయకుల దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more