లంచం ఇవ్వటం కూడా ఒక కళే. కావలసిన పనికి ఎవరికి ఇవ్వాల్లో తెలియాలి. ఎంత ఇవ్వాలో సరిగ్గా లెక్కగట్టగలగాలి. తక్కువైతే డబ్బు పోయి పనీ జరగదు. ఎక్కువిస్తే ధన నష్టమే కాకుండా అయ్యవారి రేటుని కూడా పెంచినవారవుతారు. ఎక్కడివ్వాలో తెలియాలి. ఎక్కడబడితే అక్కడ ఠకాలుమని డబ్బు బైటికి తీసి ఇవ్వటం సరి కాదు. ఏ విధంగా ఇవ్వాలో కూడా తెలియాలి. ఎడం చేత్తో తీసి పడేసినట్టుగా ఇస్తారా, రెండు చేతుల్తో జాగ్రత్తగా పట్టుకుని ఇస్తారా లేకపోతే బ్యాగ్ పళంగా ఇచ్చేస్తారా లేదా ఇవ్వనా వద్దా అన్నట్టు సంశయాత్మకంగా వ్యవహరిస్తారా అన్నది సరిగ్గా నిర్ణయించుకోవాలి. డబ్బు ఇచ్చే సమయం కూడా అంటే టైమింగ్ సరిగ్గా ఉండాలి. చెప్పాల్సిందంతా చెప్పి అవతల వింటున్న అధికారి స్పందన చూసి ఇవ్వాలి. మాటలే పూర్తికాకుండా డబ్బు బయటకు తీస్తే అదేదో తాయిలం చూపించి ముందు హోం వర్క్ చెయ్యమన్నట్టుంటుంది. ఇంత ఇవ్వాలి అని తేలకుండా ఇచ్చేయటం కూడా సరైన పద్దతి కాదు- అంటూ తెలివి తక్కువగా వ్యవహరించిన ఒక వైద్యాధికారి గురించి కార్యాలయాల్లో పైరవీలు చేసేవారు అనుకుంటున్నారు.
లంచం ఇవ్వజూడటంలో సరిగ్గా వ్యవహరించకపోతే, ఏమీ తెలియదనుకోవాలా లేకపోతే ఏదైనా రాజకీయపుటెత్తుందా అని భయపడే అవకాశం కూడా ఉంటుంది. అసలే సిబిఐ, ఎసిబిలు వీర విహారం చేస్తున్న రోజులు. ఏ పదవిలో ఉన్నా అరెస్ట్ లకు వెనకాడని రోజులు.
ఈ నేపథ్యంలో నిన్న సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి దగ్గరకి రంగారెడ్డికి చెందిన వైద్యాధికారిణి జయకుమారి వచ్చి, తనని బదిలీ చేస్తున్నారని విన్నానని చెప్పగా మంత్రిగారు తనకా విషయం తెలియదని, కనుక్కుంటానని అన్నారు. ఆయన కనుక్కునే వరకూ ఆగలేని జయకుమారి తన దగ్గరున్న బ్యాగ్ జిప్ ని సర్ మని తీసి సార్ అంటూ 3 లక్షల రూపాయలను తీసి మంత్రి టేబుల్ మీద పెట్టి, ఇది ఉంచండి అని అన్నారు.
విస్తుపోయిన మంత్రి రవీంద్రరెడ్డి, ఆమెను బయటకు పంపించేసారు (డబ్బుతో సహా). ఈ విషయాన్ని ఓఎస్ డి కి చెప్పటం వలన ఓఎస్ డి కూడా అప్రమత్తంగా ప్రవర్తించారట. అక్కడ కూడా ఆమె పెటపెటలాడే ఆ 3 లక్షల కొత్త నోట్లను ఆయన టేబుల్ మీద పెట్టి ట్రాన్స్ ఫర్ ని ఎలాగైనా ఆపమని అడిగారటామె. విశ్వసనీయ వర్గాల నుండి లభించిన ఈ సమాచారం మీడియానూ ఆశ్చర్యపరచింది.
ఇలా, తెలిసీ తెలియని లంచం నాడి ఎరుగని వ్యవహారం అందరినీ ఇరుకున పెడుతుంది కదా. తెలివి తక్కువ అనుకోవాలా లేకపోతే తెలివిగా ఇరికిద్దామని చూస్తున్నారా అన్నది తెలియక చివరకు అందరూ అశాంతిలో కొట్టుమిట్టాడే పరిస్థితి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more