Daggubati venkateswara rao astrology

Daggubati Venkateswara Rao astrology,Congress party, Chandara Babu, Lakshmi parvathi, Balakrishna, Gali, YS jagan, Chiranjeevi, D Srinivas, Bosta Satyanarayana, TRS Party, K Chandrasekhara Rao, TRS MLAs MPs

Daggubati Venkateswara Rao astrology

daggubati11.GIF

Posted: 11/18/2011 07:58 PM IST
Daggubati venkateswara rao astrology

Daggubati Venkateswara Rao astrology

 దగ్గుబాటి ఈ మధ్య కాలంలో పుస్తకాలు రాయడం, రాజకీయ అంశాలను పరిశీలించి విశ్లేషించడం హాబీగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన జోష్యాలు దాదాపు కరెక్టుగా రావడం ఆయనకు సంతోషం కలిగిస్తోంది. ఒకటి గతంలో కాంగ్రెస్ కు 166 సీట్లు వస్తాయని చెప్పారట . దగ్గుబాటీ చెప్పింది నిజంగానే జరిగింది. ఇంకా రెండోవది.. తెలంగాణపై కేంద్రం రెండో ఎస్ఆర్ సి తీసుకుంటుందని .. చెప్పాడట. అది కూడా దగ్గుబాటీ చెప్పినట్లే .. ఎఐసీసీ అధికారి ప్రతినిధి రషీద్ అల్వీ, ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ లు రెండో ఎస్ఆర్ సి ప్రతిపాధనను తెరపైకి తేవడంతో దగ్గుబాటి జోస్యం నిజమైందని ఆయన సంబరపడుతున్నాడు. 

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు దగ్గుబాటి ఇంటి ముందు క్యూకట్టరట. దగ్గుబాటి ఈ కొత్త అవతారం చాలా బాగుందని .. ప్రజలు అనుకుంటున్నారు. కేంద్ర మంత్రులు కూడా ఆయన ఇంటి ముందుకు వచ్చి తన జాతకలను తెలుసుకోవటానికి కొన్ని రోజులుగా ఉండి పోతున్నారట. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రావటంతో.. ఆయన జ్యోతిష్యనికి ఫిజు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడట. 

సీనియర్ ఎన్టీఆర్ కి అల్లుడైతే .. నాకు అల్లుడే అంటూ Lakshmi Parvathi దగ్గుబాటీ దగ్గరు వెళ్లి నా భవిష్యత్ ఎలా ఉందని .. నాకు మంచి రోజులు వస్తాయా? నేను ఇప్పు డు ఏ పార్టీలో ఉంటే భాగుంటుందని, చంద్రబాబు నాతో కలుస్తాడా? నాకు పూర్వ వైభవం వస్తుందా అని అడగాలని సిద్దమైందట. ఇంకా జగన్ అయితే మన కొత్త పార్టీ భవిష్యత్ ఏమిటో తెలుసుకోమని నటి రోజాను పంపింసాడట. పనిలో పనిగా ఆమె కూడా తన జాతకం గురించి చెప్పమని ..కోరిందట. రోజా .. కోరిన కోరికలో.. చాలా ఉన్నయాట. తను మళ్లీ సినిమాలో నటించేందుకు అవకాశం వస్తుందా? బాలయ్యతో సినిమా చేస్తానా? జగన్ పార్టీలో నా భవిష్యత్ ఎలా ఉంటుందని దగ్గుబాటిని అడగాలని ఉందట.

చిరంజీవి .. కూడా నా భవిష్యత్ ఎలా ఉందని ఫోన్ చేసి అడుగుతున్నాడట. అంటే సోనియా గాంధీ మంత్రి పదవి ఇస్తుందా? కాంగ్రెస్ లో నా జీవితం ఎలా ఉంటుందని అడుగుతున్నడట. అలాగే బొత్స సత్యనారయణ నా పీసీసీ వచ్చింది.. నేను సీయం అయ్యే చాన్సు ఉందా? లేక పీసీసీ గానే ఉండాలా? అడగటానికి రెఢీ అవుతున్నాడట. సందట్లో సడేమియాలగా డి. శ్రీనివాసరావు కూడా .. నాకు సోనియా గాంధీ ఏ పదవి ఇస్తుందని .. అడగాలని ఉందట.

ఇలా అందరు భవిష్యతు తెలుసుకోవటంతో.. ముఖ్యమంత్రి కూడా తన జాతకం తెలుసుకోవాలని ఒక ఎమ్మెల్యే ను పంపించాడట. ఇంకా ఎంతకాలం సీయం సీటు ఉంటుంది? సీయం సీటు పోతే.. సోనియా గాంధీ నాకు ఎలాంటి పదవి ఇస్తుంది అని అడగమన్నాడట.
ఆ నోట ఈ నోట విన్న బాలయ్య కూడా బావ దగ్గరు వెళ్లి .. ఆయన జాతకం తెలుసుకున్నాడని తెలుసుంది. టీడీపీలో నాకు ఎలాంటి గౌరవం లభిస్తుంది. సినిమాల్లో ఇప్పుడు చిరంజీవి లేడు కాబట్టి నేనే నెంబర్ వన్ గా ఉంటానా? అని ఇంకా చాలా అడిగి తెలుసుకున్నాడట. బాలయ్య వెళ్లి చంద్రబాబు దగ్గర పెద్ద బావ గురించి చెప్పెడట.

బాబు ఆయన నాకు జాతకం చెప్పాడు? ఎందుకంటే.. ఆయనకు భవిష్యత్ లేకుండా చేసింది నేనే కాదా? అసలు ఆయనకు జ్యొతిష్యం నేర్పింది కూడా నేనే. ఆ శాస్త్రం మొత్తం నాకు వచ్చు. కావలంటే నేనే మీకు, ఆయనకు చెబుతాను అని చంద్రబాబు అన్నాడట.
ఇది తెలుసుకున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు .. కే. చంద్రశేఖరు .. ఇంకా కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దగ్గుబాటి కలిసి .. మాకు తెలంగాణ వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది? ఒక వేళ హైదరాబాద్ తో కలిసి వస్తుందా? లేక హైదరాబాద్ లేకుండా తెలంగాణ వస్తుందా? అని టీఆర్ఎస్ వాళ్లు అడగాలని ఉన్నారట.

ఈ విషయం అలా అలా గాలిలో తిరుగుతూ .. చంచల్ గూడాలో జైల్లో ఉన్న ‘గాలి’కి తెలిసిందట. ఇంకేముంది.. తన శిష్యుడైన ..శ్రీరాముల్ని తన తరుపున దూతగా పంపించాడట. ’గాలి‘కి బెయిల్ దొరుకుందా? లేదా? కోర్టులో శిక్ష పడుతుందా? గాలికి తిరిగి పూర్వవైభవం వస్తుందా,? అని అడిగాడట. పనిలో పనిగా రాజీనామా చేసి శ్రీరాములు కూడా మళ్లి బై ఎలక్షన్లో గెలుస్తానా? లేదా అని అడిగాడట.
చివరగా .. పార్టీలకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు , ఎంపీలు.. కూడా వెళ్లి తమ బాధలు చెప్పుకున్నారట. దగ్గుబాటికి వచ్చిన ఈ కొత్త అవతారం చూసిన ప్రజలు .. కారంచేడులో.. మరొ కొత్త బాబాగా వెలుగుతాడేమోనని అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panja nizam rights sold
Mahesh babu steps into the shoes of abhishek bachchan in the businessman  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more