AVAK trailer is catchy and colourful ఎమోషన్, హాస్యం నిండిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ ట్రైలర్.!

Ashoka vanam lo arjuna kalyanam theatrical trailer is catchy and colourful

Ashoka Vanamlo Arjuna Kalyanam, Theatrical Trailer, Vishwak Sen, Rukshar Dhillon, SVCC Digital, Jay Krish, Vidya Sagar Chinta, Bapineedu B, Sudheer Edara, Tollywood, Movies, Entertainment

Makers of Vishwak Sen-starrer Ashoka Vanam Lo Arjuna Kalyanam, who recently announced that the film would be released in theaters on May 6, have now released its trailer. Filled with colourful visuals and catchy content, the trailer indicates that the film is going to be a fabulous family entertainer fit for all age-groups.

ఎమోషన్, హాస్యం నిండిన ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ ట్రైలర్.!

Posted: 04/20/2022 09:40 PM IST
Ashoka vanam lo arjuna kalyanam theatrical trailer is catchy and colourful

ఫ‌ల‌క్‌నుమా దాస్‌ సినిమాతో క్లాస్, మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్. ప్ర‌స్తుతం ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు. విశ్వ‌క్ సేన్ న‌టిస్తోన్న తాజా చిత్రాల్లో ఒక‌టి అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం. విద్యాసాగ‌ర్ చింత డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ట్రైల‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. రుష్క‌ర్ ధిల్లాన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ‘అంటే ఎంగేజ్‌మెంట్ క‌దండి..గెట‌ప్ ఛేంజ్ చేశా’ అంటూ విశ్వ‌క్ సేన్ సంభాష‌ణ‌ల‌తో షురూ అయింది ట్రైల‌ర్‌.

‘మా సూర్యాపేట‌లో మొత్తం ఒక్క‌టే టాపిక్‌. అర్జున్ కుమార్ అల్లం గాడికి పెళ్లి కాలేదు..పెళ్లి కాలేదు..’అని చెబుతున్నాడు విశ్వ‌క్ సేన్‌. ‘కుదిరింది..కుదిరింది పెళ్లి.. ఊరుగాని ఊరు..కులం గాని కులం..ఒక‌టి కాని యాస ‘అంటూ వ‌స్తున్న‌ వాయిస్ ఓవ‌ర్ స‌రికొత్త‌గా ఉంది. ‘గోదారోళ్లమండీ..ఏం పెట్టినా మ‌ర్యాద‌గానే పెడ‌తాం..అని పెళ్లి కూతురు త‌ర‌పు వాళ్లంటుంటే..మేం తెలంగాణ‌లోళ్లం మాకు మ‌ర్యాద ఒక్క‌టి స‌రిపోదు…మ‌ట‌న్ కూడా కావాలని’ పెళ్లి కొడుకు త‌ర‌పు బంధువులు చెప్పే డైలాగ్స్ కొత్త‌గా ఆక‌ట్టుకునేలా సాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles