Chiru-Charan Starrer Acharya Will Be A Visual Treat: koratala మెగాస్టార్ పంచప్రాణాలు ఏంటో చెప్పేసిన కొరటాల

Chiranjeevi ramcharan s acharya will be a visual extravaganza director koratala siva

‘Acharya’ megastar, Chiranjeevi, mega power star, Ram Charan, Kajal Agarwal, Pooja Hedge, Koratala Siva, S Thaman, Konidela Productions, Tollywood, movies, Entertainment

‘Acharya’, directed by Koratala Siva, is set for a worldwide release on April 29. Siva said his film will be a visual treat for moviegoers. He stated in a recent interview that ‘Acharya’ will be a visual treat for both fans and moviegoers. He stated that it is a large story with all of the necessary commercial elements.

మెగాస్టార్ చిరంజీవి పంచప్రాణాలు ఏంటో చెప్పేసిన కొరటాల

Posted: 04/20/2022 08:44 PM IST
Chiranjeevi ramcharan s acharya will be a visual extravaganza director koratala siva

తెలుగు పరిశ్రమలో అపజయం మాట ఎరుగని అరుదైన దర్శకులలో కొరటాల శివ ఒకరు. దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ ఫ్లాప్ అనే మాటనే వినలేదు. ఒకదానికి మించిన మరో హిట్.. దానిని రికార్డులను బద్దలుకొడుతూ మరొకటి.. ఇలా అప్రతిహాత విజయాలతో ఆయన దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రమైన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ను కూడా ఈ చిత్రంలో ఆయన డైరెక్ట్ చేశారు.

ఈ చిత్రం ప్రమోషన్స్ లో కొరటాల కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. "చిరంజీవిగారికి సెట్ అంటే ఇష్టం. ఆయన సీనియర్ ఆర్టిస్ట్ గనుక, ఆయనకి సాయంకాలం 4.40కి పేకప్ చెప్పేవాడిని. మిగతా వాళ్లందరినీ గం. 6.40కి పంపించేవాడిని. కానీ చిరంజీవిగారు అక్కడి నుంచి వెళ్లేవారు కాదు. అలా టీ తాగుతూ అక్కడే కూర్చునేవారు. అందరూ వెళ్లే సమయంలోనే ఆయన కూడా సెట్ నుంచి వెళ్లేవారు. ఆయన అంకితభావం అలాంటిది. ఆయన సీనియారిటీకి మనం గౌరవిస్తాం. కానీ ఆయన మాత్రం నటనకు ఎన్ సైక్టోపిడియా అయినా.. అందరికోసం అక్కడే ఉంటారు.

సెట్ లో అందరికీ పేకప్ చెప్పిన తరువాతనే చిరంజీవి సెట్ నుంచి బయటకు వెళ్లేవారు. సెట్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం .. లైట్స్.. సౌండ్..  యాక్షన్.. కట్ అనేవి ఆయనకి ఎంతో ఇష్టం. ఇక సెట్ కి ఎవరైనా వస్తానంటే వెల్ కమ్ చెప్పడమే కాదు.. వాళ్ల కోసం ఎంతో ఓపికగా వెయిట్ చేసేవారు. వాళ్లతో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవారు. ఒక సీనియర్ నటుడు ఇంత సేపు సెట్ లో ఉండటంతో జూనియర్లు కూడా ఆయన నుంచి నేర్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఇంటి దగ్గర కన్నా సెట్లో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారని.. ఆయనకు సెట్ అంటే పంచప్రాణాలని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles