Director Maruthi father Dasari Vana Kuchala Rao passes away ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట తీవ్ర విషాదం..

Director maruthi father dasari vana kuchala rao passes away

Director Maruthi, director Maruthi father demise, Dasari Vana Kuchala Rao, Machilipatnam, Krishna district, Maruthi father, Maruthi father died, Pakka Commercial, Raja Deluxe, Prabhas, Anushka, Tollywood, Movies, Entertainment

Maruthi Dasari , the director, screenwriter, producer who works primarily in Telugu cinema is best known for making small budget movies. He is known for directing the movies like Ee Rojullo and Bus Stop. The talented film maker Maruthi is associated with Maruthi Talkies, a film production house in the Telugu film industry.

ప్రముఖ దర్శకుడు మారుతి ఇంట తీవ్ర విషాదం..

Posted: 04/21/2022 11:19 AM IST
Director maruthi father dasari vana kuchala rao passes away

టాలీవుడ్ పరిశ్రమలో వరుసగా విషాదాలు సంభవిస్తున్నాయి. మొన్న నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్, నిన్న తాతినేని రామారావు మరణించగా.. ఆ విషాదఛాయల నుంచి పరిశ్రమ ప్రముఖులు తేరుకోకముందే మరో విషాదం సంభవించింది. ప్రముఖ దర్శకుడు మారుతి తండ్రి కుచలరావు మరణించారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. గత అర్ధరాత్రి కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణంలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కుచలరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్న మారుతి.. తొలుత సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, యాడ్స్‌ డిజైనర్‌గా రాణించిన తరువాత చిత్రపరిశ్రమలో దర్శకుడిగా అరంగ్రేటం చేశారు. ‘ఈ రోజుల్లో’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత బస్‌ స్టాప్‌ మూవీని తెరకెక్కించాడు. ఈ రెండు చిన్న చిత్రాలు మంచి విజయాలను నమోదు చేసుకున్నాయి. దీంతో ప్రేమకథా చిత్రంతో నిర్మాతగా మారాడు మారుతి. అగ్రహీరోలను సైతం డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మారుతి డైరెక్ట్ చేసిన ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా గతేడాది నవంబరులో విడుదలైంది. త్వరలోనే 'పక్కా కమర్షియల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే, ప్రభాస్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే అది సెట్స్‌పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles