DJ Tillu rocks at box office on 9th day డీజే టిల్లు సౌండ్ తో బద్దలవుతున్న బాక్సీఫీస్

Sidhu jonnalagadda s dj tillu 9 days box office collections

DJ Tillu, Siddhu Jonnalagadda, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi, Narra Srinivas, Kireeti Damaraju, Vimal Krishna, Sricharan Pakala, Thaman S, Suryadevara Naga Vamsi, Tollywood, movies, entertainment

South Industry's film 'DJ Tillu' is consistently performing well at the box office. Actor Sidhu Jonnalagadda and actress Neha Shetty are in lead roles in this Telugu film. The film was released on 12 February i.e. last Saturday. Where the film earned a total of Rs 26.40 crore Gross Collections on the day 9. The film has collected a total of Rs 12.16 crores Share.

డీజే టిల్లు సౌండ్ తో బద్దలవుతున్న బాక్సీఫీస్

Posted: 02/21/2022 04:11 PM IST
Sidhu jonnalagadda s dj tillu 9 days box office collections

త‌న సినిమాకు త‌నే క‌థ రాసుకుని టాలీవుడ్ మొత్తాన్ని త‌న వైపు చూసేలా చేసుకున్న న‌టుడు సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌. గుంటూర్ టాకీస్ క‌థ రాసి అందులో న‌టించి మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. కాని సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌కు కావలిసినంత ఫేమ్ రాలేదు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కృష్ణ ఆండ్ ఇజ్ లీల సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. సిద్ధూ ప్ర‌స్తుతం డిజే టిల్లు స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. ఫిబ్ర‌వరి 12న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీని సృష్టిస్తుంది. ఈ చిత్రం విడుద‌లైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను కంప్లీట్ చేసుకుంది.

అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూట‌ర్లు ఇప్పటికే లాభాల బాట ప‌ట్టారు. తాజాగా ఈ చిత్రం USA బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల జోరు చూపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం USA బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 500k డాల‌ర్స్ క‌లెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. 2022లో మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. 70 ల‌క్ష‌ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివ‌ర‌కు 3 కోట్ల 72ల‌క్ష‌ల పైగా క‌లెక‌న్ల‌ను సాధించి ట్రిపుల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 4.5 కోట్లకు పైగా ప్రాఫిట్స్‌ను సాధించింది. ఇందులో సిద్ధూకు జోడిగా నేహాశెట్టి హీరోయిన్ గా న‌టించింది.

ఏరియా వారీగా 9 రోజుల విభజనలు ఇలా ఉన్నాయి-

నైజాం : రూ 6.37 కోట్లు
సీడెడ్ : రూ 1.61 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ 1.16 కోట్లు
తూర్పు : రూ 68 ఎల్
వెస్ట్: రూ 72 ఎల్
గుంటూరు : రూ 66 ఎల్
కృష్ణా : రూ 56 ఎల్
నెల్లూరు: రూ. 40 ఎల్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం : రూ. 12.16 కోట్లు (రూ. 21.22 కోట్లు)
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ 0.90 కోట్లు
ఓవర్ సీస్: రూ 1.90 కోట్లు
డిజే టిల్లు మొత్తం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్: రూ. 14.96 కోట్లు (రూ. 26.40 కోట్ల గ్రాస్)

రోజు వారీ కలెక్షన్స్:-

1వ రోజు: రూ. 3.18 కోట్లు
2వ రోజు: రూ. 2.62 కోట్లు
3వ రోజు : రూ. 1.40 కోట్లు
4వ రోజు: రూ. 1.09 కోట్లు
5వ రోజు : రూ. 95 ఎల్
6వ రోజు : రూ. 81 ఎల్
7వ రోజు : రూ. 72 ఎల్
8వ రోజు : రూ. 60 ఎల్
9వ రోజు : రూ. 79 ఎల్
మొత్తం AP/TS : రూ. 12.16 కోట్లు (రూ. 21.22 కోట్ల గ్రాస్)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DJ Tillu  Siddhu Jonnalagadda  Neha Shetty  Vimal Krishna  Sricharan Pakala  Tollywood  

Other Articles