Venkatesh releases Kaushal Manda First Look from 'Right' కౌశల్ చిత్రం ‘రైట్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వెంకటేశ్

Motion poster of kaushal manda s right unveiled by venkatesh

victory Venkatesh Kaushal mandas right movie first look, Kaushal mandas right movie, right movie first look, Kaushal Manda, bigg boss telugu, Kaushal speech, Kaushal army, bigg boss Kaushal, Kaushal Manda, Kaushal interview, victory Venkatesh, victory Venkatesh launches Kaushal Manda, bigg boss 2 telugu, Kaushal right, Kaushal Manda right movie, Kaushal leesha eclairs, leesha eclairs, leesha eclairs right movie, tollywood, movies, Entertainment

Kaushal Manda and Leesha Eclairs are the heroines on the banner of Mahankali Movies. Right is the suspense thriller film co-produced by Mahankali Divakar and Lukalapu Madhu under the direction of Shankar. Speaking on the occasion, Victory Venkatesh said, “I am happy to release the first look and motion poster of the movie Right starring Kaushal.

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా కౌశల్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Posted: 02/21/2022 03:10 PM IST
Motion poster of kaushal manda s right unveiled by venkatesh

బిగ్ బాస్ టీవీ షో సీజన్-2 టైటిల్ విన్నర్ కౌశల్ మందా నటించిన చిత్రం ‘రైట్‌’. దృశ్యం లాంటి ఉత్కంఠభరిత సస్పెన్స్ ధ్రిల్లర్ చిత్రాలను రూపోందించిన దర్శకుడు జీతు జోసెఫ్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విక్టరీ వెంకటేశ్ లాంచ్ చేశారు. దర్శకుడు శంకర్ రూపోందిస్తున్న ఈ చిత్రంలో లీశా ఎక్లైర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన అనంతరం విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ.. ’రైట్‘ చిత్రం ఫస్ట్‌లుక్, మోషన్‌ పోస్టర్‌ బాగుంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అని హీరో వెంకటేశ్‌ అన్నారు.

‘బిగ్‌బాస్‌ 2’ విన్నర్‌ కౌశల్‌ మండ, లీషా ఎక్లైర్స్‌ జంటగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రైట్‌’. మహంకాళి దివాకర్, లుకలాపు మధు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ అండ్‌ మోషన్‌ పోస్టర్‌ను వెంకటేశ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కౌశల్‌ మాట్లాడుతూ ‘‘మలయాళ చిత్రం ‘మెమోరీస్‌’కు తెలుగు రీమేక్‌ ‘రైట్‌’. ‘బిగ్‌బాస్‌’ షోలో తనను  ఆదరించిన విధంగానే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని’’ కౌశల్ మందా కోరారు. ‘‘రైట్‌’ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాతలు మహంకాళి దివాకర్, లుకలాపు మధు. ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ కూరాకుల

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh