తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగి.. సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. ప్రత్యర్థివర్గాలకు చెందిన అభ్యర్థుల అరోపణలు, ప్రత్యారోపణలు కూడా మిన్నంటి ఆద్యంతం తెలుగు ప్రేక్షకులను కూడా ఉత్కంఠకు గురిచేశాయి. ఈ క్రమంలో ఓడిమి చవిచూసిన ప్రకాష్ రాజ్.. ప్యానెల్ నుంచి గెలిచిన 11మంది వారి పదవులకు రాజీనామా కూడా చేసి.. మంచు విష్ణు ప్యానెల్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేందుకు దోహపడింది. దీంతో క్రితం రోజుతో అన్నింటికీ పుల్ స్టాప్ పడింది.
కాగా మా అసోసియేషన్ నూతన అథ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’ ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పెన్షన్ల ఫైలుపై తొలి సంతకం చేశారు. అత్యంత ఆదరణ కలిగిన సినీకళామతల్లికి చెందిన బిడ్డల ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించడంతో ప్రజలు కూడా ప్యానెల్ వారిగీ విడిపోయి తమ స్టార్లకు మద్దుతు పలికేలా పరిస్థితి మారింది. ఇక గత ఆదివారం జరిగిన ఈ ఎన్నికలలో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు.
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన వారిని కొనసాగిస్తారా..? లేక వారి అభీష్టం మేరకే రాజీనామాలను అమోదిస్తారా.? అన్నది వేచి చూడాల్సిందే. ఇక వారి స్థానాలను ఇతరులతో భర్తీ చేసే అంశంపై కూడా మంచు విష్ణు ఆయన ప్యానెల్ సభ్యులు ఎలా స్పందిస్తారన్న అంశం కూడా ఉత్కంఠను రేపుతోంది. వారి భర్తీ చేయకుండా వేరే నిర్ణయం తీసుకుంటారా అనే దానిపై అందరిలో పలు సందేహాలు నెలకొన్నాయి. ‘మా’ బైలాస్‌కి అనుగుణంగా విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
I have today assumed the office of the President of MAA! Need all your wishes and send me positivity as much as you can. #MAA pic.twitter.com/cYUiuxmwQ9
— Vishnu Manchu (@iVishnuManchu) October 13, 2021
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more