Chiranjeevi tests negitive for Covid-19 మెగా అభిమానులకు చిరంజీవి శుభవార్త

Megastar chiranjeevi konidela tests negitive for covid 19

Chiranjeevi, Chiranjeevi corona, Chiranjeevi Asymptomatic, Chiranjeevi covid, Chiranjeevi covid19, Chiranjeevi coronavirus, Acharya, Chiranjeevi movies, Chiranjeevi Celebrities, Chiranjeevi fans, Tollywood, movies, Entertainment

Telugu megastar Chiranjeevi on Thursday announced that he has tested negitive for coronavirus, after a group of doctors concluded three different tests and the reports state that he is covid negitive, The 65-year-old actor said that he did a COVID-19 test as part of the safety protocol before joining the sets of his upcoming movie Acharya and the result was positive due to faulty RT PCR Kit.

ఫ్యాన్స్ తో శుభవార్తను పంచుకున్న మెగాస్టార్ చిరంజీవి..

Posted: 11/13/2020 11:14 PM IST
Megastar chiranjeevi konidela tests negitive for covid 19

యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి బారిన తాను పడ్డానని ఇటీవల ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా అభిమానులకు ఆయన శుభవార్తను అందించారు, తాను కోవిడ్ బారిన పడలేదని తాజాగా పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం స్పష్టం చేసిందని అన్నారు. మూడు బిన్న పరీక్షలు నిర్వహించారని, వాటి నివేదికలలో తనకు కోవిడ్ నెగిటివ్ వచ్చిందని కూడా చెప్పారు, అయితే తొలుత తాను చేయించుకున్న పరీక్షలో రాపిడ్ టెస్ట్ పీసీఆర్ కిట్ లోపం వల్ల తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు, ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో అప్ డేట్ పోస్టు చేస్తూ తన టెస్టు రిపోర్టును కూడా పోస్టు చేశారు.

ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురైన ఆయన కాలం, కరోనా గత నాలుగు రోజులుగా తనను కన్ఫ్యూజ్ చేసి, తనను అడేసుకున్నాయని అన్నారు. అదివారం టెస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్ిచన తరువాత తాను కరోనాను నియంత్రించేలా బేసిక్ మెడికేషన్ ప్రారంభించానని అన్నారు, రెండు రోజులు గడిచినా తనకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అపోలో అసుపత్రికి వెళ్లి అక్కడ పరీక్షలు చేయించుకున్నానని అన్నారు. అక్కడి వైద్యలు సిటీ స్కాన్ చేసి తన ఛాతిలో ఎలాంటి కరోనా ఆనవాళ్లు లేవని తేల్చారన్నారు. మొత్తంగా అపోలో వైద్యబృందం మూడు పరీక్షలు నిర్వహించి తనకు కరోనా లేదని స్పష్టం చేశారని తెలిపారు.

అయినా ఎంతకైనా మంచిదని మరోచోట కూడా తనకు కరోనా సోకిందన్న అనుమానాలను నివృత్తి చేసుకుందామని టెనెట్ ల్యాబ్ లో మరోమారు పరీక్ష చేయించుకున్నానని తెలిపారు, అక్కడి వైద్య నిపుణులు కూడా మూడు రకాల కిట్స్ లతో టెస్ట్ చేశారు, అయితే అక్కడ కూడా నెగిటివ్ రిపోర్టే వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంలో తనకు తొలుత వచ్చిన కరోనా పాజిటివ్ నివేదిక లోపభూయిష్ట ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఫలితంగానేనని అన్నారు, దీంతో తనకు తాను కరోనా అనుమానాల నుంచి విముక్తిడి అయ్యానని, ఈ శుభవార్తను అభిమానులతో, ఆత్మీయులతో పంచుకోవాలని సామాజికమాద్యమంలో పోస్టు చేస్తున్నట్లు తెలిపారు. తాను కోలుకోవలని కోరుకన్న అందరికీ ఆయన వినమ్రపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Chiranjeevi corona  covid19  Chiranjeevi coronavirus  Acharya  Tollywood  movies  Entertainment  

Other Articles