క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'లో ప్రతినాయకుడు ఎవరన్న విషయంలో రేగిన ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడిందని సమాచారం, ఈ విషయంలో గత కోన్నాళ్లుగా కొనసాగుతన్న సస్పెన్స్ కు మరో తమిళస్టార్ చెక్ పెట్టాడు. ఓ వైపు హీరోగా పలు చిత్రాల్లో బిజీగా వుంటూనే ఇటు విలన్ పాత్రలోనూ ఒదిగిపోయేందుకు తాను రెడీ అంటున్నాడు. అంతేకాదు బన్నితో గతంలోనూ తాను ప్రతినాయకుడిగా తలపడ్డానని, ఇక అంతకుమించి ఈ చిత్రంలోనూ తాను తలపడతానని అంటున్నాడు. ఇంతకీ ఎవరీ హీరో అంటారా.. వరుడు చిత్రంలో విలన్ గా నటించిన ఆర్యనే ఈ చిత్రంలోనూ విలన్ గా కన్ఫాప్ అయ్యాడని టాక్.
ఈ ప్రతినాయకుడి పాత్రలో తొలుత తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తారని వార్తలు వచ్చాయి, అయితే డేట్స్ తరువాత సమస్య తలెత్తడంతో ఆయన ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు, దీంతో పుష్ప చిత్రంలో ఎవరు ప్రతినాయకుడి పాత్రకు సెట్ అవుతారా.. అన్న ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో పలువురు తమిళ నటులతో పాటు బాలీవుడ్ నటుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి, అయితే వరుడు చిత్రంలో విలన్ గా నటించిన ఆర్య.. బన్ని పుష్పలోనూ తలపడుతున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుడు తర్వాత పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విషయం తెలిసిందే.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ చిత్రం షూటింగును కేరళ అడవులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో లాక్ డౌన్ విధింపుతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఇక పరిస్థితులు కుదుటపడటంతో ఈ చిత్రం షూటింగును తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో రెండు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు, అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని బాణీలను కూడా ఆయన సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. లారీ డ్రైవర్ గా వున్న పుష్ప ఎలాంటి పరిస్థితుల్లో చందనం స్మగ్లర్ గా మారారన్నదే చిత్రకథ. ఈ పుష్పరాజ్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more