యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలసి దర్శకదిగ్గజం ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్నగా పేరుగాంచిన రాజమౌళి.. అత్యాంత అద్బుతంగా సెల్యూలాయడ్ వండర్ గా తెరకెక్కించిన బాహుబలి చిత్రాల తరువాత రూపోందిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి మూలంగా ఏకంగా ఏడు నెలల పాటు సినిమా షూటింగ్ వాయిదా పడింది, దీంతో ఇటీవలే షూటింగ్ ను ప్రారంభించిన జక్కన్న తన టీమ్ తో కలసి దీపావళి పండుగను జరుపుకుంది. ఆర్ఆర్ఆర్ బ్యానర్ చుట్టూర దీపాల వరుసలు పెట్టి సెలబ్రేట్ చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో కలసి చిత్ర దర్శకుడు జక్కన్న దిగిన ఫోటోలు దిగారు. మన్నెందోర అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, తెలంగాణ గొండు వీరుడు కొమరం భీమ్ గా నటిస్తోన్న ఎన్టీఆర్ లతో కలిసి రాజమౌళి మాట్లాడుతున్న ఓ ఫోటో విడుదల చేసింది చిత్రయూనిట్. వీటితో పాటు హీరోలిద్దరూ కలసి దిగిన ఫోటోలు, ఆ తరువాత విడివిడిగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని హీరోలు ఇద్దరూ తెల్లని దుస్తులు ధరించి కనిపించడంతో ఫ్యాన్ పండగ చేసుకుంటున్నారు, అర్ఆర్ఆర్ టీమ్ హీరోల అభిమానులతో పాటు తమ ఫ్యాన్స్ కు కూడా దీపావళి కానుకు ముందుగానే ఇచ్చేశారు,
ఇక కరోనా నేపథ్యంలోనే కాకుండా జక్కన్న దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపోందబడే చిత్రాలు ఫర్ ఫెక్షన్ కోసం ఆలస్యం కావడం కూడా సర్వసాధారణమే. ఆర్ఆర్ఆర్ (రౌద్రం, రణం, రుధిరం) చారిత్రక చిత్రంలో ఎన్టీఆర్, చరణ్ లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కు కూడా అత్యంత ప్రాథాన్యత ఇచ్చే దర్శకుడు.. ఈ చిత్రం విడుదలపై ఎప్పుడు ప్రకటన చేస్తాడా అని అటు యంగ్ టైగర్, ఇటు మెగా పవర్ స్టార్ అభిమానులు వేచిచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more