Chiranjeevi advises disciplinary action against Rajasekhar ‘మా’ డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ రసాభస: చిరంజీవి అసంతృప్తి

Chiranjeevi miffed with rajasekhar for speech at maa event scolds him on stage

Chiranjeevi, Rajasekhar, MAA Event, Chiranjeevi news, Chiranjeevi work, Chiranjeevi Vs Rajasekhar, Chiranjeevi at MAA event, Chiranjeevi against Rajasekhar, diary launch, park hayath, Mohan Babu, Tollywood, Entertainment, movies

Chiranjeevi advises disciplinary action against Rajasekhar: Chiranjeevi advised to take disciplinary action against Rajasekhar for his behaviour in the event. The event, which was supposed to be all about MAA's achievements, took an unpleasant turn when Rajasekhar addressed the gathering.

‘మా’ డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ రసాభస: చిరంజీవి అసంతృప్తి

Posted: 01/02/2020 07:12 PM IST
Chiranjeevi miffed with rajasekhar for speech at maa event scolds him on stage

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ మాలో మరోమారు విభేధాలు బహిర్గతమయ్యాయి. మా డైరీ ఆవిష్కరణ సభ రసాభసగా మారింది. మా ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్, అధ్యక్షుడిగా ఉన్న నరేష్ ల మధ్య గతంకొంతకాలంగా విభేదాలు వున్నాయి. వీరిద్దరి మధ్య నడుస్తున్న వివాదాలకు మరోసారి వేదికైంది మా డైరీ ఆవిష్కరణ సభ. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల ముందరే ఆయన తన అక్రోశాన్ని వెళ్లగక్కారు. ఏదైతే వద్దు అని అంటున్నా.. వేదికపై పలువురు వారిస్తున్నా.. పట్టించుకోని రాజశేఖర్.. ప్రముఖులతో కూడా అమర్యాదగా వ్యవహరించి సభాను రచ్చరచ్చ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, క్రిష్ణం రాజులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు టాలీవుడ్ ముఖ్య ప్రముఖులతో పాటు తెలుగు టీవీ ఛానెళ్ల లైవ్ టెలికాస్ట్ నడుస్తున్న క్రమంలోనే ఇలా జరగడంపై చిరంజీవి మండిపడ్డారు. ఇష్టం లేకపోతే రాకూడదని.. వచ్చి ఇలా మా పరువును తీయకూడదని అన్నారు. వెళ్లిన వ్యక్తి మళ్లి వచ్చి.. ఇష్టం వుండే ఇక్కడికి వచ్చాం.. ఇంతా చేశామని.. అన్న రాజశేఖర్ మళ్లీ వెనక్కు వెళ్లారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్న సందర్భంలో రాజశేఖర్ పదే పదే అడ్డుపడతూ వేదికపై రచ్చ చేయడంపై మెగాస్టార్ ఫైర్ అయ్యారు.

ఇదేనా సంస్కారం.. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి. అయితే మళ్లీ వేదికపైకి వచ్చిన రాజశేఖర్.. పరుచూరి మాట్లాడుతున్న సందర్భంలో మైక్ తీసుకుని.. పెద్దలందరికీ కాళ్లకి దండం పెడుతున్నా అంటూ స్టేజ్ మీద ఉన్న అందరి కాళ్లకు నమస్కారం చేసి.. మాట్లాడుతూ.. ‘చిరంజీవి బ్రహ్మాండంగా మాట్లాడారు. మా ఎన్నికల తరువాత నేను సినిమా కూడా చేయలేదు. వీటివల్ల మా ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. నన్ను మెంటల్‌గా ప్రవర్తిస్తున్నారని ఇంట్లో తిట్టారు. చివరికి నాకు పెద్ద యాక్సిడెంట్ కావడానికి, నా కారు పోవడానికి కూడా ‘మా’ కారణం.

చిరంజీవి అందరూ కలిసి ఉండాలని చాలా బాగా మాట్లాడారు. బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చారు. లోకంలో ఇలాగే మాట్లాడాలి. కాని ఇక్కడ ఒక నిప్పుని కప్పిపుచ్చితే పొగ రాకుండా ఉండదు. మంచి మైక్‌లో చెప్పమని చెడుని చెవిలో చెప్పమని చిరంజీవి చెప్తున్నారు. కాని వాస్తవంలో నిప్పు ఉంటే పొగ వస్తుంది. చిరు, మోహన్ బాబులు వారిస్తుండగా.. ‘నన్ను మాట్లాడనీయండి.. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా కదా.. వినండి. అందరి ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి.. వాటిని కప్పిపుచ్చుకుంటున్నారు. మనం హీరోలుగా సినిమాల్లో నటిస్తున్నాం.. కాని రియల్ లైఫ్‌లో లొక్కేస్తున్నారు.. తొక్కేస్తున్నారు.

వినండి మోహన్ బాబు, చిరంజీవి.. మీరు అరిస్తే ఇక్కడ ఏం కాదు. నేను మీ గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్‌లో ఉన్న 26 మందిలో 18 ఒకవైపు 8 ఒకవైపు. ఇంతకుముందు శివాజీ, శ్రీకాంత్ చేసినప్పుడు ఎలాంటి వివాదాలు లేవని చిరంజీవి అన్నారు. కాని ఇప్పుడు వాళ్లనే తప్పుచేశారని నరేష్ గారు ముందుకు వచ్చి చెప్తున్నారు. మా ఇంత దారుణంగా ఉంది. ఏది సక్రమంగా జరగడం లేదు. నేను ఇలాగే మాట్లాడతా.. ఇలాగే ఉంటా.. దీని వల్ల నాపై నిందలు వేసినా పర్లేదు. నేను సత్యంగా బతకాలని అనుకుంటున్నా. అందుకే నిజాన్ని చెప్తున్నా. నేనేం చిన్నపిల్లాడిని కాదు.. కప్పిపుచ్చేయడానికి’ అంటూ కోపంగా స్టేజ్ దిగి వెళ్లిపోయారు రాజశేఖర్.     

సభలో జరిగిన ఈ వివాదం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వేదికపై ఉండగానే హీరో రాజశేఖర్ పరుషంగా మాట్లాడడాన్ని చిరంజీవి తీవ్రంగా పరిగణించారు. ఈ సభను రసాభాస చేయడానికి ముందే ప్లాన్ చేసుకుని వచ్చారని ఆరోపించారు. ఇది వెల్ ప్లాన్డ్ చర్య తప్ప మరొకటి కాదని అన్నారు. "నేను చెప్పిందేమిటి... మంచి ఉంటే మైక్ లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండని అన్నాను. ఆ మాటలను గౌరవించనప్పుడు, ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటనిపిస్తోందని’’ అన్నారు.

మెగాస్టార్ మాట్లాడుతూ ‘‘బయటి ప్రపంచానికి మన బలహీనతను చెప్పుకోవడం తప్ప ఈ గొడవ వల్ల ఒరిగిందేమిటి? ఎంతో సజావుగా సాగుతున్న ఈ సభలో దురుసుగా మైక్ లాక్కుని మాట్లాడడం ఏం మర్యాద? ఇప్పటికీ నేను స్పందించకపోతే నా పెద్దరికానికి విలువ లేదు. ఎంత సౌమ్యంగా మాట్లాడదామనుకున్నా సరే, నాతో కూడా ఆవేశంగా మాట్లాడిస్తున్నారు. దయచేసి దీన్ని ఇంతటితో ఆపేసి మంచిగా మాట్లాడుకుందాం. మనం ఏం చేద్దామో ఆలోచించండి. ఇది ఇష్టం లేనివాళ్లు రావడం ఎందుకు?" అంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

దాంతో రాజశేఖర్ మధ్యలో వచ్చి, "నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. నేను నిజాలు మాట్లాడకుండా ఉండలేను. నేను ఆ విధంగా బతకలేను" అంటూ తన వాదన వినిపించారు. దాంతో చిరంజీవి స్పందిస్తూ, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన వివాదంలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. "ఈ సభను ముందే చెడగొట్టాలని ప్రణాళికతో వచ్చారు కనుక మనం అలాంటివాళ్లకు ఏం సమాధానం చెప్పగలం? దీనికి ఏదైనా క్రమశిక్షణ చర్యలు ఉంటే గనుక తప్పనిసరిగా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను" అంటూ బదులిచ్చారు. చిరంజీవి వ్యాఖ్యలను సభలో ఉన్నవారు హర్షధ్వనాలతో స్వాగతించారు.

ఆ తరువాత మా కార్యదర్శి హోదాలో జీవిత మాట్లాడుతూ.. 'మాలో గొడవలు జరిగితే మా కంటే ముందు మీడియాకే తెలుస్తుంది. ఇందులో దాచాల్సింది ఏదీ లేదు. ప్రతి చోట గొడవలు ఉంటాయి. మేము కూడా అందరిలా మనుషులమే. సోషల్ మీడియా, మీడియాల్లో ఎన్నో రాస్తుంటారు. మేము మీ ఇంట్లో కట్టేసిన జంతువులం కాదు. మాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయొద్దు. కావాలంటే మా సినిమాలపై మీరు కామెంట్లు చేయొచ్చు. మాపై కాదు. మీ అందరికీ తెలుసు రాజశేఖర్ గురించి. ఆయన మనసులో ఏముందో అది చెప్పడం తప్ప ఆయనకు మనసులో ఏదో దాచుకోవడం తెలియదు’ అని అన్నారు.

‘అన్ని చోట్లా వున్నట్లే మా లోనూ కొన్ని సమస్యలు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి.. ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించుకోవాలి. అందుకే రాజశేఖర్ ఇలా మాట్లాడారు. నరేశ్ కి కూడా నేను ఇదే చెబుతున్నాను. అందరితో కలిసి మేము పని చేస్తాం. ఇది జస్ట్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం. 'మా'ను చిరంజీవి ముందుండి నడిపించాలి' అని జీవిత అన్నారు. లోపాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, బయటకు తీసుకురావద్దని అన్నారు. రాజశేఖర్ తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Rajasekhar  MAA Event  diary launch  park hayath  Mohan Babu  Tollywood  

Other Articles