Chiranjeevi pecked a kiss on Mohan Babu cheek మోహన్ బాబు బుగ్గపై ‘చిరు’ ముద్దు వైరల్

Chiranjeevi and mohan babu s kissing photos go viral

Chiranjeevi, Rajasekhar, MAA Event, Chiranjeevi news, Chiranjeevi work, Chiranjeevi Vs Rajasekhar, Chiranjeevi at MAA event, Chiranjeevi against Rajasekhar, diary launch, park hayath, Mohan Babu, Tollywood, Entertainment, movies

A pic is going viral on the social media that features Chiranjeevi kissing on Mohan Babu‘ cheek. At an event of the Movie Artists Association (MAA) today in Hyderabad,

మోహన్ బాబు బుగ్గపై ‘చిరు’ ముద్దు వైరల్

Posted: 01/02/2020 08:18 PM IST
Chiranjeevi and mohan babu s kissing photos go viral

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హీరో రాజశేఖర్ ఎపిసోడ్ తో కాస్తా వాడివేడిగా కొనసాగింది. అసోసియేషన్ లోని లుకలుకలపై రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టించాయి. ఆయన వ్యాఖ్యలను చిరంజీవి తప్పుబట్టారు. ఆ తరువాత అంతా సర్ధుకుపోయినా.. స్ధబ్దుగా వుంటుంది. దాన్ని అహ్లాదకరంగా మోహన్ బాబు మార్చగా.. మరింత గ్లామర్ ను అద్ది.. పూర్తిగా వినోదాత్మకంగా మార్చేశారు మెగాస్టార్. అనంతరం మోహన్ బాబు ప్రసంగిస్తుండగా అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

తను తిరుపతిలో బిఏ చదువుతున్నప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు సినిమాలు చూశానని చెప్పారు. అనంతరం చిరంజీవికి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఇద్దరం ఒకచోట కలిస్తే ఛలోక్తులు విసురుకుంటామని.. అది కూడా సరదాకే తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవి కుటుంబం నాది.. నా కుటుంబం అతనిది అన్నారు. దీంతో చిరంజీవి ఒక్కసారి లేచి మోహన్ బాబును వెనకనుంచి ఆలింగనం చేసుకున్నారు.

ఈ సమయంలో అక్కడున్న మా సభ్యులు తమ హర్షద్వానాలతో, ఈలలతో చప్పట్లతో వారి ఆలింగనాన్ని స్వాగతించగానే.. మరో అడుగుముందుకేసిన చిరంజీవి మోహన్ బాబు వద్దకి వచ్చి బుగ్గపై ప్రేమగా ముద్దాడారు. దీంతో అప్పటి వరకు అలుముకున్న వాతావరణం కాస్తా వినోదాత్మకంగా మారిపోయింది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు సహజం కానీ మేమిద్దరం మాత్రం ఎప్పటికీ ఒక్కటే అంటూ చిరు గురించి గొప్పగా మాట్లాడారు. దీంతో, కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. ఇప్పుడు మోహాన్ బాబుని చిరు ప్రేమగా ఆలింగనం చేసుకొని ముద్దాడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Rajasekhar  MAA Event  diary launch  park hayath  Mohan Babu  Tollywood  

Other Articles