Ala Vaikunthapurramloo video song goes viral on net అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సాంగ్ హల్ చల్..

Ala vaikunthapurramloo samajavaragamana video song goes viral on net

#AlaVaikunthapurramuloo, samajavaragamana video song, Allu Arjun, Pooja Hegde, Tabu, Nivetha Pethuraj, Rajendra Prasad, Jayaram, Samuthirakani, Sushanth, Vennela Kishore, Sunil, Navdeep, Brahmaji, Murali Sharma, Rahul Ramakrishna, Harsha Vardhan, Trivikram, Thaman S, Tollywood, movies, entertainment

Stylish Star Allu Arjun's new movie Ala Vaikunthapurramuloo hits the screens for Sankranthi next year. The makers released the first single of the movie with a song which goes samajavaragamana is creating sensation online.

రికార్డు సృష్టిస్తున్న అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ సాంగ్

Posted: 12/31/2019 08:25 PM IST
Ala vaikunthapurramloo samajavaragamana video song goes viral on net

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ గా వచ్చేసిన ‘సామజవరగమన’ సాంగ్ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ లేటెస్టుగా వీడియో సాంగ్ ప్రోమోను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది.

దీంతో 'సామజవరగమన' సాంగ్ మరోమారు సోషల్‌ మీడియాను మరోసారి షేక్‌ చేస్తోంది. న్యూఇయర్‌ కానుకగా ఈ సాంగ్‌ వీడియో టీజర్ ను అల..వైకుంఠపురములో ' చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటికే 'సామజవరగమన' లిరికల్‌ సాంగ్‌ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ పాట వీడియో ప్రోమోను కూడా నెటిజన్లు అంతకు మించి ఆదరిస్తున్నారు. ఈ వీడియో సాంగ్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే 1.5 మిలియన్‌కు పైగా రియల్‌ వ్యూస్‌.. లక్షకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకొవడంతో పాటు సినీ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ పాటలోని సాహిత్యాన్ని, భావాన్ని హీరో అల్లు అర్జున్‌ చేత దృశ్య రూపంలో పలికించారు కొరియోగ్రఫర్స్‌.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో 'టబు' కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత బన్ని-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్‌ స్వరాలు అందించిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’ పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టబు, నివేదా పేతురాజు, సుశాంత్‌, రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌, నవదీప్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక, హాసిని క్రియేషన్స్‌, గీతాఆర్ట్స్‌ పతాకంపై, ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles