what Is true on Pawan Kalyan re-entry into films పవన్ కల్యాణ్ వెండితెర రీ-ఎంట్రీపై ఏదీ నిజం.?

Gossips doing rounds on pawan kalyan re entry into tollywood

Boney Kapoor, Dil Raju, Nerkonda Paarvai, Pawan Kalyan, Sriram Venu, Pink, Film trade analyst, Taran Adarsh, Telugu remake, social media, gossips, power star, Tollywood, movies, Entertainment

Gossips doing rounds on Pawan Kalyan Re-entry into Tollywood, Few Gossips says powerstar is unhappy on Boney Kapoor sharing his name with film trade analyst Taran Adarsh without his concern. And few more gossips say that he is taking RS 40 cr for doing the movie.

పవన్ కల్యాణ్ వెండితెర రీ-ఎంట్రీపై ఏదీ నిజం.?

Posted: 11/06/2019 09:31 PM IST
Gossips doing rounds on pawan kalyan re entry into tollywood

రాజకీయాలలో ఫుల్ బిజీగా వున్నా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ప్రజా సమస్యలపై ప్రజాగొంతుకనై ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన.. ఈ క్రమంలో సినిమాలకు కూడా దూరంగా వుంటానని చెప్పారు. అయితే తాజాగా దిల్ రాజుకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. పవర్ స్టార్ అభిమానులను ఫుల్లుగా హ్యఫీ చేసిన ఈ వార్తలు నిజమేనా.? అనే సమయంలోనే ఈ చిత్రానికి ఆయన రూ.40 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

మెగా అభిమానులు ఈ వార్తలు నిజమని భావిస్తున్న తరుణంలో మరో పిడుగులాంటి వార్త అందింది. తనకు తెలియకుండా.. తన అనుమతి లేకుండా.. తాను నటిస్తానో లేదోనని అడగకుండానే ప్రచారం చేసిన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తీరుపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు.. అందుకోసం దిల్ రాజు ప్రోడక్షన్స్ తో చేయికలిపినట్టు.. ఇక ప్రధాన పాత్రలో పవన్ కల్యాణ్ నటించనున్నట్లు సినీవిశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్‌ ట్వీట్ చేశాడు.

ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు  డైరెక్ట్ చేయబోతున్నాడని.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలును రాస్తున్నాడని కూడా టాక్ వినిపించింది. ఇక సినిమాలో హీరోయిన్స్‌గా నయనతార, తమన్నా, పూజా హెగ్డే‌ను  తీసుకోవాలన్న బోనీ కపూర్ సూచనలతో పాటు తాను ఈ చిత్రంలో నటిస్తున్నందుకు రూ.40 కోట్ల పారితోషకం కూడా తీసుకుంటున్నానని వార్తలు రావడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనానికి లోనయ్యారని సమాచారం. ఈ ప్రాజెక్టులో తాను నటిస్తున్నానని చెప్పే ముందు తన అనుమతి తీసుకోవాలని కదా.? అలా తన పర్మిషన్ తీసుకోకుండా... ఈ ప్రాజెక్ట్‌ను ఎలా అనౌన్స్ చేస్తారని మండిపడ్డట్టు తెలుస్తోంది.

అయితే ‘పింక్’ సినిమా చూసి ఈ కథ తనకు నచ్చింది అని చెప్పాను. కానీ ఈ రీమేక్ లో నటిస్తానని మీకు చెప్పలేదని.. కేవలం ఆలోచిస్తాను అని చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని తాను ఈ రీమేక్‌లో నటిస్తున్నట్టు ఎందుకు ప్రచారం చేసారని దిల్ రాజు, బోనీ కపూర్ లపై మండిపడ్డట్టు సమాచారం. ఈ విషయాలన్ని త్రివిక్రమ్ దృష్టికి వరకు వెళ్లగా.. తాను తిరిగొచ్చే వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి లీకులు ఇవ్వద్దని నిర్మాతలకు చెప్పాడట. తన విదేశీయానం పూర్తైన తరువాత పవన్ ను కలిసి  సినిమా చేయాలనుందో లేదో తెలుసుకుంటానిని చెప్పాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh