Pawan Kalyan celebrate Diwali with Mega Brothers మెగా కుటుంబ సపరివారంగా పవన్ దీపావళి

Pawan kalyan celebrate diwali with chiranjeevi and nagababu

megastar, bahubali, chiranjeevi, prabhas, manchu Vishnu, Viranica, diwali, festival celebrations, tollywood, movies, enterainment

Jansena President and power star Pawan Kalyan celebrated Diwali with his Mega star Chiranjeevi and Mega Brother Nagababu with families and Children.

మెగా కుటుంబ సపరివారంగా పవన్ దీపావళి

Posted: 10/28/2019 07:27 PM IST
Pawan kalyan celebrate diwali with chiranjeevi and nagababu

మెగాస్టార్ చిరంజీవి ఇంట దీపావళి పండుగ కొత్త శోభను తీసుకువచ్చింది. ప్రతి దీపావళికి తన కుటుంబసభ్యులతో చాలా సందడిగా దీపావళి పండుగను జరుపుకునే చిరంజీవి ఈ సారి తన మెగా సోదరులను కూడా తన ఇంటికి అహ్వానించుకుని వారితో సరదాగా సంతోషంగా దీపావళి సంబరాలను జరుపుకున్నారు. జనసేన పార్టీ అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పాటుగా మెగా బ్రదర్ నాగబాబు కుటుంబసభ్యలుతో పాటుగా వచ్చి మెగాఇంట సందడి చేశారు.

దీంతో చిరంజీవి ఇంట్లో పండుగ శోభ సంతరించుకోవడంతో పాటు ఆనందం వెల్లివిరిసింది. భార్య అన్నా లెజినోవా, కుమారులు అకీరానందన్, మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు ఆద్యలతో కలసి పవన్ వచ్చారు. ఇక నాగబాబు కూడా తన భార్య, కూతురితో పాటు చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. అన్నయ్యతో కలసి, తల్లి అంజనాదేవి, పిల్లలతో కలసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar  bahubali  chiranjeevi  prabhas  manchu Vishnu  diwali  festival celebrations  tollywood  

Other Articles