Prabhas, Chiranjeevi celebrate Diwali with Manchu మంచు ఇంట మెగా బాహుబలి దీపావళి..

Prabhas and chiranjeevi celebrate diwali with vishnu manchu and family

megastar, bahubali, chiranjeevi, prabhas, manchu Vishnu, Viranica, Ira Vidya, diwali, festival celebrations, tollywood, movies, enterainment

Baahubali Prabhas and Megastar Chiranjeevi made an appearance at Vishnu Manchu's house and celebrated Diwali with Manchu Vishnu and his wife Viranica.

మంచు ఇంట దీపావళి కాంతులు.. చిరు, ప్రభాస్ లతో వెలుగులు

Posted: 10/28/2019 06:36 PM IST
Prabhas and chiranjeevi celebrate diwali with vishnu manchu and family

మంచు అన్న పేరు వినగానే మోహన్ బాబు గుర్తుకువస్తారు. ఎంతో క్రమశిక్షణకు, సమయపాలనకు, వ్యక్తిత్వానికి, దిక్సూచిలా నిలిచే ఆయన పేరు వినగానే ఎంతో కఠినమైన డైలాగులు తెలుగువారికి గుర్తుకు వస్తాయి. ఈ విషయం పక్కనబెడితే.. మంచు వారింట ఈ ఏడాది దీపావళి పండుగ కొత్త కాంతులను తీసుకుని వచ్చింది. మంచు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొని సందడి చేశారు.

దీపావాళి సందర్భంగా మంచు విష్ణు తన నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి పలువురు సినీ స్టార్స్ హాజరయ్యారు. సైరా నరసింహారెడ్డి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు మెగాస్టార్ చిరంజీవి, బాహుబలి, సాహో చిత్రాలతో తెలుగువారి సత్తా చాటిన డార్లింగ్ ప్రభాస్ విష్ణు ఇచ్చిన పార్టీకి ప్రత్యేక అతిధులుగా హాజరుకావడంతో వారింట్లో దీపావళి పండుగు రోజున కొత్త వెలుగులు సంతరించుకున్నాయి.

మంచు ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ, ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రభాస్.. ఆ తరువాత తన పెదనాన్న కృష్ణంరాజు ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నాడు. కృష్ణంరాజు, ఆయన భార్య శ్యామలా దేవి.. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ పండుగ జరుపుకున్నాడు. అందరితో కలిసి పటాసులు కాలుస్తూ హంగామా చేశాడు. ప్రభాస్ దీపావళి వేడుకల ఫోటోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.

‘సాహో’ తర్వాత ప్రభాస్, ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) న్యూ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి వేడుకల్లో పాల్గోన్నడంపై మంచు విష్ణు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించాడు. ‘మనందరికీ ఇష్టమైన చిరంజీవి అంకుల్‌కి మా కూతురు ఐరా విద్యను పరిచయం చేశాను’ అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశాడు విష్ణు.  ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కాగా, విష్ణు, విరానికా దంపతులకు నలుగురు సంతానం. వీరికి డిసెంబరు 2011లో అరియానా, వివియానా అనే ఇద్దరు కవల అమ్మాయిలు జన్మించారు. 2018లో అవిరామ్‌భక్త అనే అబ్బాయి జన్మించగా, ఈ ఏడాది ఆగస్టులో ఐరా విద్య జన్మించింది. చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా నవంబర్ రెండోవారం నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar  bahubali  chiranjeevi  prabhas  manchu Vishnu  diwali  festival celebrations  tollywood  

Other Articles