Sye Raa 14 days box office collections in Telugu states తెలుగునాట రూ.225 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’

Sye raa box office day 14 collection chiru s film mints rs 225 crore in telugu states

Sye Raa Narasimha Reddy, Sye Raa 14th day collection, Fourteenth day collections, Telugu states, sye raa narsimha reddy box office, sye raa chiranjeevi collections, chiranjeevi sye raa 14th day collections, Chiranjeevi, nayantara, amitabh bachchan, surender reddy, Chiranjeevi, Tollywood, Entertainment, Movies

Sye Raa Narasimha Reddy has completed two weeks of run in theatres. Chiranjeevi starrer has collected a gross of over Rs 225 crore from the first 14 days of run in theatres across the globe.

రెండు వారాలు పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘సైరా’.. కలెక్షన్స్ ఎంతంటే..

Posted: 10/16/2019 08:14 PM IST
Sye raa box office day 14 collection chiru s film mints rs 225 crore in telugu states

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా.. ఆయన నటించిన తొలి చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాలను పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా సందడి చేస్తాన్న ఈ చిత్రం.. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు 'సైరా నరసింహా రెడ్డి' తన జైత్రయాత్రను కొనసాగిస్తూనే వున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి అభినయం చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ.. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన రెండవ చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 225 కోట్ల రూపాయల గ్రాస్ వసూళు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక దసరా సీజన్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా నరసింహా రెడ్డి జోష్ కనిపించింది. ఆర్టీసీ బస్సుల స్ట్రైక్, తెలంగాణలో సెలవుల పొడగింపు కూడా సైరాకు కలిసొచ్చిందని టాక్ నడుస్తోంది.

14వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 84 లక్షల వసూళ్లు రాబట్టినట్లుగా రిపోర్ట్స్ వచ్చాయి. నైజాంలో 28 లక్షలు, సీడెడ్‌లో 20 లక్షలు, ఉత్తరాంధ్రలో 16 లక్షలు, ఈస్ట్ గోదావరి 5.3 లక్షలు, వెస్ట్ గోదావరి 4.1 లక్షలు, గుంటూరు 3.3 లక్షలు, కృష్ణా 4.2 లక్షలు, నెల్లూరు 2.9 లక్షలు, మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 84 లక్షల మేర వసూళ్లు రాబట్టిన ‘సైరా’ స్టడీగా వసూళ్లు సాధిస్తుండటంతో ముందు ముందు మరిన్ని రికార్డ్‌లు తిరగరాయటం ఖాయం అంటున్నారు అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles