'Meeku matrame chepta' theatrical trailer launch ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైయిలర్ అదుర్స్..

Vijay devarakonda meeku matrame chepta theatrical trailer launch

Meeku Matrame Chepta, Mahesh babu, Trailer launch, Vijay Devarakonda, Tharun Bhascker, Abhinav Gomatam, Naveen George Thomas, Anasuya Bharadwaj, Vani Bhojan, Sivakumar, Shammeer Sultan, Tollywood, Movies, Entertainment

After announcing the title through a hilarious video of Vijay Deverakonda film, Super star Mahesh babu has unveiled the theatrical trailer of his maiden film as a producer titled Meeku Matrame Chepta.

విజయ్ దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైయిలర్ అదుర్స్..

Posted: 10/16/2019 07:18 PM IST
Vijay devarakonda meeku matrame chepta theatrical trailer launch

యూవతను అకర్షిస్తున్న క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా ‘ఎ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్’ బ్యానర్‌పై 'మీకు మాత్రమే చెప్తా' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రధారిగా నిర్మితమైన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ .. వాణి భొజన్ .. అభినవ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాకి షమ్మీర్ సుల్తాన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకుని చిత్రం రిలీజ్ కు కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది. నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. మంచివాళ్లమనే పేరు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఆ ఇమేజ్ ను డామేజ్ చేసే చిన్నతప్పు జరిగినప్పుడు, దానిని సరిదిద్దుకునే క్రమంలో నుంచి పుట్టే కామెడీగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్‌గా ట్రైలర్ లాంచ్ జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర యూనిట్ ట్రైయిలర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘ఈ కాంబినేషన్ కొత్త గా ఉంది. విజయ్ ప్రొడ్యూసర్, తరుణ్ భాస్కర్ హీరో అని వినగానే కొత్తగా అనిపించింది. ‘పెళ్ళి చూపులు’ నాకు బాగా నచ్చిన సినిమా, విజయ్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles