Win-Win situation for Ravi Teja & Ajay Bhupathi బెట్టువీడి మెట్టుదిగిన మాస్ మహారాజా రవితేజా..

Win win situation for ravi teja ajay bhupathi

Mass Maharaja, Ravi Teja, Ajay Bhupathi, RX 100 movie, Ravi Teja Maha Samudram, Ajay Bhupathi Maha Samudram, Maha Samudram, ravi teja next film, entertainment, movies, tollywood

Mass Maharaja Ravi Teja and Ajay Bhupathi have joined their hands for an upcoming project Maha Samudram, which is expected to go on the floor very soon.

బెట్టువీడి మెట్టుదిగిన మాస్ మహారాజా రవితేజా..

Posted: 07/22/2019 09:13 PM IST
Win win situation for ravi teja ajay bhupathi

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కూడా కొన్ని అవాంతరాలు ఏర్పడిన తరుణంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంత పట్టు వీడాలని సూచించడంతో రవితేజ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అంతకుముందు కొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కు కూడా అవాంతరాలు ఏర్పడిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా తరువాత 'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతితో 'మహా సముద్రం' సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవలసింది. కానీ పారితోషికం విషయంలో రవితేజ మెట్టు దిగకపోవడమే కారణమనే టాక్ వినిపించింది. ఈ క్రమంలో డిస్కోరాజా చిత్రంలో పవన్ చెప్పిన ఐడియానే రవితేజా తన మహా సముద్రం చిత్రానికి కూడా అమలు చేశారట. అదేంటో తెలుసా.?

రవితేజ అడిగిన పారితోషికాన్ని తాను ఇవ్వలేనని నిర్మాత తేల్చి చెప్పాడట. అయితే 'మహా సముద్రం' కథ తనకి బాగా నచ్చడంతో, ఆ కథను వదులుకోవడం ఇష్టం లేని రవితేజ, లాభాల్లో వాటా ఇస్తే ఓకే అని అనేశాడట. అందుకు నిర్మాత అంగీకరించిన కారణంగానే ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైందని అంటున్నారు. ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mass Maharaja  Ravi Teja  Ajay Bhupathi  Maha Samudram  tollywood  

Other Articles