Priyamani's sirivennala trailer launched ‘‘నన్ను బంధించడం నీవల్లకాదురా’’

Actress priyamani s sirivennala trailer launched

Sirivennela, Official Trailer, Priyamani, Baby Sai Tejaswini, Prakash Pulijala, Kalakeya Prabhakar, movies, entertainment, tollywood

Presenting the Official Trailer of #Sirivennela; an upcoming Telugu Movie starring Priyamani Raj, Baby Sai Tejaswini (Mahanati Fame) & Kalakeya Prabhakar.

‘‘నన్ను బంధించడం నీవల్లకాదురా’’ సిరివెన్నెల ట్రైయిలర్

Posted: 07/22/2019 07:18 PM IST
Actress priyamani s sirivennala trailer launched

ప్రియమణి ప్రధానపాత్రలో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ.. సిరివెన్నెల.. శాంతి టెలీఫిల్మ్స్, ఏఎన్‌బి కో-ఆర్డినేటర్స్ బ్యానర్స్ నిర్మిస్తుండగా, ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహించాడు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మనవరాలు, మహానటి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బేబి సాయి తేజస్విని ఈ సినిమాలో కీలకపాత్ర పోషించింది. తాజాగా సిరివెన్నెల థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర నిర్మాణ యూనిట్ విడుదల చేసింది.

తనకు జరిగిన అన్యాయానికి పగతో రగిలిపోయే ఒక ఆత్మ తన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే పాయింట్‌ తో ఈ సినిమా రూపొందుతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ప్రియమణి, బేబి సాయి తేజస్వినిల నటన, కెమెరా, గ్రాఫిక్ వర్క్, ఆర్ఆర్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమా ఆడియో బిగ్ సీడీని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి ఆవిష్కరించారు.

సిరివెన్నెల తన సెకండ్ ఇన్నింగ్స్‌కు చక్కటి శుభారంభాన్నిస్తుందని ప్రియమణి ధీమా వ్యక్తం చేసింది. అజయ్ రత్నం, కాలకేయ ప్రభాకర్, నేహా దేశ్‌పాండే, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం : ఏఎన్‌బి కో-ఆర్డినేటర్స్, కెమెరా : కళ్యాణ్ సమీ, ఎడిటింగ్ : నాగేశ్వర్ రెడ్డి, విజువల్ ఎఫెక్ట్స్ : విరించి ప్రొడక్షన్స్, సాంగ్ కంపోజర్స్ : కామ్రాన్, మంత్ర ఆనంద్, లిరిక్స్ : శ్రీరామ్ తపస్వి, నిర్మాణం : కమల్ బోరా,  ఏఎన్‌బి కో-ఆర్డినేటర్స్..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sirivennela  Official Trailer  Priyamani  Baby Sai Tejaswini  Prakash Pulijala  tollywood  

Other Articles