Lakshmi's NTR trailer: RGV's Bold Cut on NTR ‘‘ జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు’’

After courting controversy trailer of rgv s lakshmi s ntr out

Lakshmi's NTR Movie Trailer, #NTRtrueSTORY, RGV, Ramgopal Varma, ntr, lakshmis ntr trailer, Chandrababu Naidu, Yagna Shetty, Agasthya Manju, Vennupotu Story, tollywood, movies, entertainment

The makers of Lakshmi’s NTR, Ram Gopal Varma’s biopic on the life of NT Rama Rao, released the trailer of the film, after a bout of controversies, has portrayed AP CM Chandrababu Naidu as a clear antagonist in the story

‘‘ జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు’’: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రయిలర్

Posted: 02/14/2019 09:23 PM IST
After courting controversy trailer of rgv s lakshmi s ntr out

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ‘ఎన్టీఆర్’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటన చేసిన రోజు నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా టీజర్‌లో ఎన్నో విషయాలు ప్రస్తావించారు వర్మ. ‘నమ్మితేనే కదా మోసం చేసేది’ అంటూ అడవిరాముడు సినిమాలోని డైలాగ్‌ను స్క్రీన్‌పై ప్లే చేశారు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన రోజులవి అంటూ టీజర్ మొదలవుతుంది.

అప్పుడే ఫోన్ కాల్ రావడం, ఆ తర్వాత ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా ఒక్కొక్కరుగా ఆయన్ని విడిచి వెళ్లిపోవడం చూపించారు. అనంతరం లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇవ్వడం, కాళ్లు మొక్కి స్వామి మీకు ఫోన్ చేసిన లక్ష్మీపార్వతిని నేనే అంటూ పరిచయం చేసుకోవడం టీజర్‌లో చూపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి దగ్గరకావడం, దీంతో ఆమెను ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ధూషించి కొట్టడం, తమ బంధంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ వద్ద బాధపడటం, పార్టీ, కుటుంబం నుంచి ఎన్టీఆర్‌ను దూరం చేసేందుకు చంద్రబాబు చేసిన కుట్ర, ప్రజల మధ్యలో ప్రసంగిస్తున్న ఎన్టీఆర్‌పై చెప్పులు విసరడం.. ఇలా తన సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్‌లోనే చూపించేశారు వర్మ.

‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం’ అంటూ ఎన్టీఆర్ కంటతడి పెడుతూ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్ ముగించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలతో వర్మపై టీడీపీ శ్రేణులు మండిపడిన సంగతి తెలిసిందే. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్‌లో ఏకంగా చంద్రబాబునే విలన్‌గా చూపిండటంతో మరింత వివాదం రగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles