Political Parties Fear for Pawan Force says Tammareddy | పవన్ సాయం తీసుకున్నప్పుడు ఇవేం గుర్తుకు రాలేదా? : పార్టీలకు తమ్మారెడ్డి ప్రశ్న

Tammareddy on pawan political tour

Tammareddy Bharadwaj, Janasena Party, Pawan Kalyan, Political Yatra, Congress Party, BJP, Tammareddy on Political Tour

Tollywood Veteran Director Tammareddy Bharadwaj Comments on Pawan Kalyan Janasena Party Political Tour and he responds on Pawan Kalyan's JANASENA party entry in 2019 elections in both Telangana and Andhra Pradesh.

పవన్ ‘ఫోర్స్’ కాబట్టే అడ్డుకుంటున్నారు : తమ్మారెడ్డి

Posted: 01/25/2018 04:01 PM IST
Tammareddy on pawan political tour

తెలంగాణలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర ముగిసిన వెంటనే పార్టీలు.. ఆయనపై పలువురు విమర్శలు గుప్పించారు. అయితే పవన్ వాటిపై పెద్దగా రియాక్ట్ కాకపోయినా.. ‘నా ఆలోచన’ ద్వారా ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఎవరైతే ఆయన వెనుక తిరిగారో.. వాళ్లే ఇప్పుడు పవన్ ను విమర్శించటం సరికాదని ఆయన చెబుతున్నారు.

పనవ్ తన యాత్ర ప్రారంభించిన రోజు నుంచే జాతీయ పార్టీలు విమర్శలు ప్రారంభించాయి. కనీసం ఆయన ఏం మాట్లాడతాడో కూడా వినకుండా తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. మరి 2014 ఎన్నికలప్పుడు, పవన్ మీకు మద్దతు ఇచ్చినప్పుడు ఇవేం గుర్తుకు రాలేదా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. జనసేనను భజనపార్టీ అని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆయన్ని(పవన్ ను) ఇంటింటీకి తీసుకెళ్లారే! అప్పుడు తెలియలేదా ఆయనది భజనపార్టీ అని? తెలీలేదా.. ఆరోజున పవన్ కల్యాణ్ గారిని ‘ఫోర్స్’ అని అనుకున్నారు గనుకే తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా ‘ఫోర్స్’ అని అనుకుంటున్నారు కాబట్టే భయపడిపోయి విమర్శలు చేస్తున్నారు.

జాతీయ పార్టీల నేతలు ఇంత చౌకబారు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా? ఒక మనిషిని లక్ష్యంగా చేసుకుంటే ఏమొస్తుంది? ఇందులో ఏమన్నా అర్థముందా? దేశాన్ని గురించి ఆలోచించడం మానేశారా? కేవలం మాటల ద్వారా వేధించడం, వార్తల్లో కెక్కాలనే ఉద్దేశంతోనే పవన్ పై విమర్శలు చేస్తున్నారా? దేశానికి ఏం చేద్దామనే ఆలోచనను విడిచిపెట్టి ఎవరి మీద రాయి వేద్దాం, విమర్శలు చేద్దామనే ఆలోచనలను జాతీయ పార్టీల నేతలు మానుకోవాలి’ అని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles