GST Plagiarism RGV Slapped with Court Notices | విడుదలకు ముందే వర్మకు దెబ్బ

Rgv court notices

Ram Gopal Varma, God Sex and Truth, Hyderabad Civil court, RGV GST, Varma GST

Hyderabad Civil court issued notices to director Ram Gopal Varma. God, Sex and Truth: RGV Faces Rs.5-Lakh Lawsuit From 'Sarkar 3' Scriptwriter Jaya Kumar. RGV booked for obscenity a day before 'GST' release.

జీఎస్‌టీ కాపీ.. వర్మకు కోర్టు నోటీసులు

Posted: 01/25/2018 04:22 PM IST
Rgv court notices

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న కాన్సెప్ట్‌ను 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' ల‌ఘుచిత్రం కోసం ఉప‌యోగించాడ‌ని పి.జ‌య‌కుమార్ అనే వ్య‌క్తి కోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్ మేర‌కు ఆర్జీవీకి కోర్టు నుంచి నోటీసులు అందిన‌ట్లు తెలుస్తోంది.

2015 ఏప్రిల్‌ 1న ఈ స్క్రిప్ట్‌ను తాను వర్మకు పంపానని, కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాక‌పోగా, ఇప్పుడు జీఎస్టీ చిత్రంగా మ‌లిచి విడుద‌ల చేస్తున్నాడ‌ని జయకుమార్‌ తెలిపారు. ట్రైల‌ర్‌లో హీరోయిన్ చెప్పిన ప్ర‌తి మాట తాను రాసిందేన‌ని, రామ్‌గోపాల్ వ‌ర్మ క‌నీసం క్రెడిట్స్ కూడా ఇవ్వ‌కుండా త‌న స్క్రిప్ట్‌ను ఉప‌యోగించుకున్నాడ‌ని గ‌తంలో జ‌య‌కుమార్ అన్నాడు. ఈ ఆరోపణలపై స్పందించిన వర్మ జయకుమార్ ను ఓ జోకర్ అని అభివర్ణించాడు. అయితే జయకుమార్ దానికి ఆయన సైతం ధీటుగా స్పందించారు. `ఓకే నేను జోకర్ ను..వర్మ నా బ్యాట్ మన్` అంటూ ధీటైన సమాధానం ఇచ్చారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వర్మ ఈ లఘుచిత్రాన్ని విడుదల చేయనుండగా.. మ‌హిళా సంఘాల నుంచి తీవ్ర‌వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోన్న సంగ‌తి విదిత‌మే! దేవి అనే సామాజిక కార్యకర్త వర్మపై ఫిర్యాదు చేశారు. తనపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఇక రేపు విడుదల కానున్న ఈ వీడియోను ఫ్రీగా చూడటానికి మాత్రం వీలు కాదని వర్మ తెలిపాడు. భారత్ తో వీడియో కావాలంటే 200రూ. ఖర్చు చేయాల్సిందేనని ట్వీటర్ లో ట్వీటాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles