Savyasachi Follows Silent Formula for Success | సవ్యసాచి.. ఎందుకీ సైలెన్స్?

Naga chaitanya silent on savyasachi

Naga Chaitanya, Chandoo Mondeti, Savyasachi Movie, Savyasachi Naga Chaitanya

Naga Chaitanya's Savyasachi follows Silent Mantra. Chandoo Mondeti directs this thriller.

చైతూ సైలెంట్ ఎందుకయ్యాడంటే...

Posted: 01/25/2018 03:34 PM IST
Naga chaitanya silent on savyasachi

కార్తీకేయ, ప్రేమమ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందు మొండేటి. ఇప్పుడు నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి'ని రూపొందిస్తున్నాడు. ఎడమ చెయ్యి.. కంట్రోల్ లో లేకపోవటం అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చందూ చై క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు.

తద్వారా సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ఇక ఈ చిత్రంలో కన్నడ అమ్మాయి నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మాధవన్ .. భూమిక ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అంతకు మించి ఈ సినిమా ఎలాంటి విషయాలను .. విశేషాలను బయటికి వదలకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే మాధవన్ మాత్రం ఈ సినిమా కంటెంట్ సూపర్బ్ గా ఉందని తన సన్నిహితులతో చెప్పాడట. దాంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. సైలెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చేసి ఘన విజయాన్ని సాధించే ఛాన్స్ వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టుతోపాటు మారుతి డైరెక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు లో కూడా చైతూ నటించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles