Maha Kali Serial Imitates goes Wrong kills Boy | సీరియల్ లోలాగా చేద్దామనుకుంటే ప్రాణాలు పోయాయి..

Mahakali serial imitates kills boy

Uttar Pradesh, Maha Kali Serial, Kali Avataar, Imitates, Chitranajan, School Children Death

Lucknow teen dies trying to imitate Goddess Kali from TV serial.The boy, Chitranajan, was a student of Class 9 and was playing with his younger sister Gunjan, 9, and other neighbours late on Tuesday night and told them that he would show them the 'Kali Avataar'. He then playfully tied a dupatta around his neck and put a noose on the door. By the time someone could understand the seriousness of the act he had been choked to death due to strangulation, an official probing the incident informed. Scared children raised an alarm but by the time the parents rushed to the child's rescue, he was dead.

బాలుడి ప్రాణాలు తీసిన హిందీ సిరియల్

Posted: 12/28/2017 06:36 PM IST
Mahakali serial imitates kills boy

సినిమాలు, సీరియళ్లు.. రియల్ లైఫ్ లో చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. మొన్నీమధ్యే ఓ భార్య ప్రియుడిని తన భర్త స్థానంలో తీసుకొచ్చేందుకు చేసిన యత్నం గురించి ఆసక్తికరంగా చర్చించుకున్నాం. ఇప్పుడు ఇటీవ‌ల ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌కి చెందిన 14 ఏళ్ల బాలుడు సీరియ‌ల్‌లో పాత్ర‌ను అనుక‌రించ‌బోయి ప్రాణాలు కోల్పోయాడు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన 14 ఏళ్ల చిత్రంజన్ `మ‌హాకాళి` సీరియ‌ల్‌లో ఓ స‌న్నివేశాన్ని అనుక‌రించి చూపిస్తాన‌ని త‌న చెల్లి గుంజ‌న్(9) తో చెప్పాడు. ఆ స‌న్నివేశంలో అమ్మ‌వారి నాలుక బ‌య‌టికి వ‌చ్చి ఉంటుంది. అలా త‌న నాలుక కూడా వీలైనంత మేర బ‌య‌టికి తీయ‌డం కోసం చున్నీని మెడ‌కు చుట్టుకున్నాడు. ఆపై చున్నీని ఓ డోర్ కు తగిలేశాడు. అయితే అది ఎంత ప్రమాదమో ఆ బాలుడికి అప్పుడు అర్థం కాలేదు. కాసేపటికే ఉరి ప‌డి, ఊపిరాడ‌క గిలగిల కొట్టుకున్నాడు.

అక్క‌డే ఉన్న ఇద్ద‌రు పిల్ల‌లూ బ‌య‌టికి వెళ్లి పెద్ద‌వాళ్ల‌కు చెప్పి, వాళ్లు సంఘ‌ట‌న స్థలానికి వ‌చ్చేస‌రికే రంజిత్ ప్రాణాలు కోల్పోయాడు. గ‌తంలో కూడా రంజిత్ ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌బోయాడ‌ని, అప్పుడు అత‌ని త‌ల్లి గ్ర‌హించి ఆపిన‌ట్లు తెలుస్తోంది. రెండు నెల‌ల క్రితం ఓ బాలిక, సీరియ‌ళ్ల ప్ర‌భావంతో త‌న‌ను తాను ద‌హించివేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles