Rape case filed against Kannada Young Hero | కూల్ డ్రింక్ లో డ్రగ్ ఇచ్చి రేప్ చేశాడు.. ఆపై యాసిడ్ పోస్తానని బెదిరించాడు

Kannada young hero in rape case

Sandalwood, Actor Subramanya, Rape Case, Tirathahalli, Basavanagudi Women's Police

Kannada actor Subramanya sedated, raped me, says woman. Later he threatened her that he would throw acid on her if she tried to marry anyone else.

రేప్ కేసులో కన్నడ యువ హీరో

Posted: 12/29/2017 04:01 PM IST
Kannada young hero in rape case

అత్యాచార కేసులో కన్నడ యంగ్ హీరో బుక్కయ్యాడు. హోంబణ్ణ చిత్ర హీరో సుబ్రహ్మణ్య తనని అత్యాచారం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని 23 యువతి చెబుతోంది.

బసవగుడి పోలీసుల కథనం ప్రకారం... రాజాజీనగర్ కు చెందిన యువతికి, సుబ్రహ్మణ్యకు పాత పరిచయం ఉంది. వీరు ప్రేమలో పడగా, పెద్దలు కూడా పెళ్లికి అంగీకరించారు. అయితే, 'హోంబణ్ణ' సినిమా షూటింగ్ తరువాత పెళ్లి చేసుకుంటానని సుబ్రహ్మణ్య మాటిచ్చాడు. ఈలోగా తన సిస్టర్ ఇంట్లో పార్టీ ఉందని యువతికి చెప్పిన సుబ్రహ్మణ్య ఆమె రాగా, మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆపై అత్యాచారం చేశాడు.

తనకేమయిందో తెలుసుకున్న తరువాత ఆమె పెళ్లికి ఒత్తిడి చేయగా, తప్పించుకు తిరుగుతున్నాడు. గట్టిగా నిలదీయటంతో యాసిడ్ పోస్తానని బెదిరించాడంట. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సుబ్రహ్మణ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles