Jaden Smith Trolled after Bollywood Desire Tweet | విల్ స్మిత్ కొడుకు.. సింగిల్ ట్వీట్ తో బుక్కైపోయాడు

Jaden smith wants to be in a bollywood film

Jaden Smith, Bollywood Tweet, Troll, Will Smith, Will Smith Son, Jaden Smith Troll, Jaden Smith Bollywood

Jaden Smith said he wanted to be in a Bollywood movie. Twitter: 'Say no more'

బాలీవుడ్ లో నటించాలని హాలీవుడ్ నటుడి కొడుకు కోరిక

Posted: 12/28/2017 05:54 PM IST
Jaden smith wants to be in a bollywood film

ఓవైపు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వలసలు క్యూ కడుతుంటే... వెరైటీగా హాలీవుడ్ నుంచి ఓ హీరో బాలీవుడ్ కు రావాలని కోరుతున్నాడు. ఇంతకీ అతనెవరు అనుకుంటున్నారు? ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు విల్ స్మిత్ కుమారుడు జాడెన్ స్మిత్. ఈ మేరకు తన ట్విట్టర్ లో జాడెన్ ఓ ట్వీట్ చేశాడు.

'నాకు బాలీవుడ్ సినిమాలో న‌టించాల‌ని ఉంది' అని జాడెన్ స్మిత్ సింపుల్‌గా ట్వీట్ చేశాడు. 'క‌రాటే కిడ్‌', 'ఆఫ్ట‌ర్ ఎర్త్' సినిమాల‌తో పాటు ఇటీవ‌ల విడుద‌లైన 'సైర్‌' ఆల్బ‌మ్‌తో జాడెన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక జాడెన్ ఆశ‌కి సృజ‌నాత్మ‌క‌త జోడించి, న‌వ్వు పుట్టించే కామెంట్లు, ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు.

ఇటీవ‌ల విల్ స్మిత్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. త‌న చిత్రం 'బ్రైట్‌' ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ఇండియా వ‌చ్చారు. ఈ ప్ర‌భావ‌మే జాడెన్ మీద ప‌డి ఉంటుంద‌ని నెటిజన్లు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles