Senior Actor skips assembly and Dance with Heroines | అసెంబ్లీ ఎగ్గొట్టి హీరోయిన్లతో గంతులేస్తున్న హీరో కమ్ ఎమ్మెల్యే

Social media fire on ambarish dance

Actor Ambarish, Ambarish Dance Video, Uppu Huli Khara Teaser Launch Event, Uppu Huli Khara Ambarish, Ambarish Dance with Actresses, MLA Ambarsh Controversy

Kannada Senior Actor, Congress MLA Ambarish skips assembly sessions, later seen dancing at music launch. An amateur video that surfaced online showed Ambarish dancing with a Anusree at Uppu Huli Khara launch.

నటుడు, ఎమ్మెల్యే అంబరీష్ పై సోషల్ మీడియాలో ఫైర్

Posted: 11/15/2017 01:51 PM IST
Social media fire on ambarish dance

కన్నడ సీనియర్ నటుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంహెచ్ అంబరీష్ పై పలువురు మండిపడుతుున్నారు. బెంగళూర్ లో నిన్న ఓ చిత్ర టీజర్ లాంఛ్ కు హాజరుకావటమే కాదు.. అందులో హీరోయిన్లు, యాంకర్ పై ఆయన స్టెప్పులేయటమే అందుకు కారణం.

ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సభకు హాజరుకాకుండా మాలశ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఉప్పుహుళి ఖార చిత్ర టీజర్ లాంఛ్ ఈవెంట్ కు హాజరయ్యారు. యాంకర్ అనుశ్రీ కోరిక మేరకు అక్కడ స్టేజీపై చిందులేస్తూ సరదాగా కనిపించారు. అటు తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన.. హీరోయిన్లతో సరదాగా సెల్ఫీలు దిగుతూ కనిపించారు. దీంతో ఆయన వ్యవహారంపై పలువురు మండిపడుతున్నారు.

ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఉదంతంపై చర్చతో అట్టుడుకుతోంది. ఈ కేసులో సీబీఐ ఏ1 నిందితుడిగా పేర్కొన్న మంత్రి కేజే జార్జి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీకి హాజరుకాకుండా సినిమా పంక్షన్ కు హాజరై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఆయనపై సోషల్ మీడియాలో పలువురు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కేపీసీసీ ప్రెసిడెంట్ దినేశ్ గుండు రావ్ అంబరీష్ కు మద్దతు ప్రకటించారు. ఆయనోక ఫ్రోఫెషనల్ నటుడు అని.. సభకు హాజరుకాకపోవటమన్నది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని రావ్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles