Babita Phogat to make acting debut with Badho Bahu | దంగల్ రియల్ స్టార్ ఇక సీరియళ్లలో కూడా...

Babita phogat acting debut

Babita Phogat, Babita Phogat Debut, Badho Bahu, Dangal Real Star, Badho Bahu Actress, Badho Bahu Babita Phogat

Gold medalist Wrestler Babita Phogat to make her acting debut with TV show Badho Bahu.

బుల్లితెరపై బ‌బితా ఫొగ‌ట్‌ సందడి

Posted: 11/15/2017 01:30 PM IST
Babita phogat acting debut

ఆమిర్‌ఖాన్ 'దంగ‌ల్' సినిమాతో హ‌ర్యానాకు చెందిన రెజ్ల‌ర్లు గీతా ఫొగ‌ట్‌, బ‌బితా ఫొగ‌ట్‌ల టాలెంట్ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. వెంట‌నే వాళ్ల ప్ర‌జాద‌ర‌ణ‌ను క్యాష్ చేసుకోవ‌డానికి టీవీ ఛాన‌ళ్లు క్యూ క‌ట్టాయి. అందులో భాగంగానే 'ఖ‌త్రోంకా ఖిలాడీ'లో గీతా ఫొగ‌ట్‌తో ధైర్య సాహసాలు చేయించారు. ఇప్పుడు అక్క బాట‌లోనే చెల్లెలు బబితా ఫొగ‌ట్ కూడా న‌డుస్తోంది.

అయితే బబితతో మాత్రం రిస్క్ లాంటిది చేయించట్లేదు. అండ్ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే 'బ‌ధో బ‌హూ' సీరియ‌ల్‌లో బ‌బితా ఫొగ‌ట్ క‌నిపించ‌నుంది. ఈ విష‌యాన్ని సీరియ‌ల్ నిర్మాత‌లు స్ప‌ష్టం చేశారు. నిజానికి గీతా, బ‌బితా ఇద్ద‌రినీ సీరియ‌ల్‌లో న‌టింప‌జేయాల‌ని అనుకున్న‌ట్లు నిర్మాత దీప్తి క‌ల్వాని తెలిపారు. కానీ గీతా ఫొగ‌ట్ వేరే పనుల్లో బిజీగా ఉండ‌టంతో కుద‌ర‌లేద‌ని అన్నారు.

లావుగా ఉండే యువ‌తి కుటుంబంలో, స‌మాజంలో త‌న గుర్తింపుకోసం ప్ర‌య‌త్నించే క‌థాంశంతో ఈ సీరియ‌ల్ విజ‌య‌వంతంగా న‌డుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Babita Phogat  Badho Bahu  బధో బాహు  బబితా ఫోగట్  

Other Articles