Kollywood Director Apologizes to Mehreen Pirzada | 15 రోజుల ఆమె కష్టం.. దర్శకుడు సీన్లు లేపేశాడు

Director says sorry to mehreen on movie chopped

Mehreen Pirzada, Director Suseenthiran, C/O Surya Trim, C/O Surya Delete Scenes, Mehreen Pirzada Suseenthiran, Director Sorry to Mehreen

Director Suseenthiran Apologies Mehreen Pirzada On Removing Scenes fro C/O Surya Movie. He chopped at least 20 minutes along with song, some scenes on heroines also climax part.

మెహ్రీన్ కు సుశీంద్రన్ క్షమాపణలు

Posted: 11/15/2017 02:17 PM IST
Director says sorry to mehreen on movie chopped

కోలీవుడ్ దర్శకుడు సుశీంద్రన్. ఆర్ట్ తరహా చిత్రాలను అందిస్తాడనే విమర్శతోపాటు తన చిత్రాల్లో హింస పాలు చాలా ఎక్కువగా ఉంటుందనే కంప్లయింట్ కూడా ఆయన మీద ఉంది. అయితే సందీప్ కిషన్ లాంటి యువ హీరోతో ఓ ఫ్యామిలీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ను అందించి శభాష్ అనిపించుకున్నాడు. కోలీవుడ్ తోపాటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదాకు సుశీంద్రన్ క్షమాపణలు తెలియజేస్తున్నాడు. కేరాఫ్ సూర్య తమిళ వర్షన్ ‘నెంజిల్‌ తునివిరుందాల్‌’సినిమా బాగున్నప్పటికీ నిడివి పెద్దగా ఉందని, నిడివి తగ్గిస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి. దీంతో కొన్ని సీన్లకు కత్తెరవేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. వెంటనే రంగంలోకి దిగిన దర్శకుడు సుశీంద్రన్ సినిమా నిడివి తగ్గించారు.

అందులో భాగంగా మెహ్రీన్‌-సందీప్ పై చిత్రీకరించిన ఓ పాట.. చాలా సన్నివేశాలను తీసేశారు. సుమారు 20 సన్నివేశాలను ఎడిట్ చేశారు. అంతే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు(ఆటో డ్రైవర్ ఎపిసోడ్) కూడా మార్చినట్టు ఆయన తెలిపారు. దీంతో మొత్తం మీద 15 నిమిషాల నిడివి తగ్గిందని తెలుస్తోంది.

అయితే ఈ సన్నివేశాలను సుమారు 15 రోజులు పాటు చిత్రీకరించామని.. దీనిపై ఆమెకు క్షమాపణలు చెబుతున్నామని సుశీంద్రన్ తెలిపారు. తమిళ వర్షన్ వరకు కోత విధించిన దర్శకుడు తెలుగులో మాత్రం యథాతథంగా ఆ ఎపిసోడ్ ఉంచేశాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles