Deepika Padukone gets mercilessly trolled once again | దీపిక పదుకునేను మళ్లీ ఆడేసుకుంటున్నారుగా...

Deepika padukone pic troll

Deepika Padukone, Deepika Padukone Drunk Troll, Deepika Padukone Troll, Deepika Padukone Instagram, Deepika Padukone Unibrow

After unibrow, Deepika Padukone gets mercilessly trolled once again. "How drunk does Deepika Padukone look?"

దీపిక ఫోటోను ట్రోల్ చేస్తున్నారుగా...

Posted: 09/28/2017 06:38 PM IST
Deepika padukone pic troll

షారూఖ్ ఓం శాంతి ఓంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన దీపికా పదుకునే కెరీర్ పదేళ్లు దాటిపోయింది. ఇప్పుడామె అక్కడ సీనియర్ హీరో. హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా హాలీవుడ్ లో కూడా అడుగిడి అక్కడా రాణిస్తోంది.

ఇటీవలె దీపికా తాజా చిత్రం 'పద్మావతి' ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై అభిమానులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంచితే, గత రాత్రి బాలీవుడ్ లో జరిగిన ఒక పార్టీలో దీపిక సందడి చేసింది. ఈ పార్టీలో ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్, స్టార్ డిజైనర్ మనిష్ మల్హోత్రా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నలుగురూ ఒక సెల్పీ దిగారు. దానిని మనీష్ మల్హోత్రా తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేశారు.

ఆ ఫోటోలోని దీపికను చూసిన అభిమానులు విమర్శలు ఎక్కుపెట్టడం ప్రారంభించారు. ఏంటి దీపికా పూటుగా తాగావా? అంటూ విమర్శిస్తున్నారు. డీగ్లామర్ తో ఉన్న పీకూ మైకంతో ఉన్నట్లు కళ్లు మూసేయటంతో ఇప్పుడు ఆ ఫోటో తెగ ట్రోల్ అవుతోంది. గతంలో మరి లో బికినీతో మాగ్జిమ్ ఫోటో షూట్ చేయగా, అది పెద్ద ఎత్తున్న ట్రోల్ అయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Social Media Troll  

Other Articles