Mahesh Babu Spyder Movie First Day Collections | స్పైడర్ ఫస్ట్ డే.. మహేష్ ఎంత రాబట్టడంటే..

Spyder movie collections

Mahesh Babu, Spyder Movie, Mahesh Spyder First Day Collections, Spyder Tamil Review,

Mahesh Babu Spyder Movie Collections. Murugadoss Bilingual Collects only Nominal in Telugu But Surprisingly collects high in Tamil and Overseas.

స్పైడర్ తొలిరోజు టోటల్ కలెక్షన్లు

Posted: 09/28/2017 05:46 PM IST
Spyder movie collections

మహేశ్ బాబు కొత్త సినిమా ‘స్పైడ‌ర్‌’ ఓపెనింగ్ డే కలెక్షన్లు 38 కోట్ల పై మాటే అని తేలింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ కలెక్షన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఊరట ఇచ్చే అంశం ఏంటంటే.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టడం విశేషం.

తొలి రోజు వసూలు డిస్ట్రిబ్యూటర్ షేర్ 16.11 కోట్లు రాబట్టగా, గతంలో ఈ రికార్డు శ్రీమంతుడు (14.44 కోట్టు) ఉంది. ఈ యేడాదిలో వచ్చిన డీజే కన్నా తక్కువే మహేష్ సాధించటం చర్చనీయాంశంగా మారింది.

నైజాం 4.15Cr
సీడెడ్ 1.98Cr
ఉత్తరాంధ్ర 1.75Cr
గుంటూరు 2.10Cr
ఈస్ట్ 2.31Cr
వెస్ట్ 1.90Cr
కృష్ణా 0.89Cr
నెల్లూరు 1.03Cr
మొత్తం 16.11Cr

తమిళ్ లో సూపర్ రెస్పాన్స్...

సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. విభిన్న క‌థ‌తో త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ తెరకెక్కించిన ఈ సినిమాను రజనీకాంత్‌ ప్రత్యేకంగా వీక్షించారు. అనంత‌రం ఈ సినిమా గురించి మాట్లాడుతూ చాలా బాగుందని అన్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు మంచి సందేశం కూడా ఉంద‌ని అన్నారు.

ద‌ర్శ‌కుడు మురుగదాస్ ఈ స‌బ్జెక్ట్‌ను అద్భుతంగా హ్యాండిల్‌ చేశారని, మహేశ్ బాబు న‌ట‌న‌ అద్భుతమ‌ని రజనీ కాంత్ చెప్పారు. ఇటువంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన ఆ సినిమా యూనిట్‌ కి త‌న‌ అభినందనలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. నిన్న విడుద‌లైన ఈ సినిమాలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. మురుగ‌దాస్ త‌నదైన శైలిలో ఓ మంచి సందేశాన్ని ఇస్తూ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles