Suriya Special Maharnavami Tweet goes Viral | సూర్య మహార్ననమి ట్వీట్ హాట్ టాపిక్

Suriya tweet on womans

Kollywood, Actor Suriya, Suriya Twitter

Kollywood Actor Suriya Sivakumar Mahanvamai Tweet goes viral. He Compares Woman with Goddess and Their Problems.

మహిళలపై హీరో సూర్య ట్వీట్

Posted: 09/29/2017 04:19 PM IST
Suriya tweet on womans

తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి అభిమాన‌గ‌ణాన్ని సొంతం చేసుకున్న హీరో సూర్య శివకుమార్ అలియాస్ శివ మ‌హార్న‌వ‌మి సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే ఇందుకోసం ఆయ‌న పెట్టిన పోస్టు చాలా ఆలోచింప‌జేసేలా ఉంది. నేటి స‌మాజంలో మ‌హిళ‌లు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌ను దేవ‌త‌ల‌కు అనుసంధానం చేస్తూ ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది.

`ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని.. ఏ సరస్వతీ బ‌డికి వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మీ డబ్బు కోసం తన భర్తను ప్రాధేయపడకూడదని.. కట్నానికి ఏ పార్వతీ బలి కాకూడదని.. ఏ సీతా నిశ్శ‌బ్దంగా బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని.. ఏ కాళీదేవికి ఫెయిర్నెస్‌ క్రీమ్‌ ఇవ్వకూడదని..ఈ నవమి సందర్భంగా ప్రార్థించండి’ అని సూర్య పోస్ట్‌ చేశారు.

పండ‌గ సంద‌ర్భంగా ఒక్క ట్వీట్ ద్వారా మ‌హిళా స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టి, అంద‌రిలో ఆలోచ‌న‌లు క‌లిగించేలా చేసినందుకు నెటిజ‌న్లు ఆయన్ని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం సూర్య స్పెషల్ ఛబ్బీస్ రీమేక్ తానా సెర్తానా కూటమ్ లో నటిస్తున్నారు.

మతం మారటంపై సూర్య...

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles