బాండింగ్ కు బయోపిక్ కు ముడిపెడుతోంది | Sania Chooses Parineeti Chopra for Her Biopic

Sania mirza about her biopic

Sania Mirza, Sania Biopic, Sania Mirza Biopic, Parineeti Chopra Sania Biopic, Sania Mirza Paneeti Chopra Bonding

Sania Mirza Open up About Biopic. parineeti Chopra her choice for Biopic.

సానియా మీర్జా బయోపిక్ లో బాలీవుడ్ నటి

Posted: 08/17/2017 06:55 PM IST
Sania mirza about her biopic

బాలీవుడ్ లో త్వరలో మరో బయోపిక్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాదీ టెన్సిస్ సంచలనం సానియా మీర్జా జీవిత గాథను సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కించే యత్నం చేస్తున్నారు కొందరు మేకర్లు. అయితే ఇంతవరకు ఎవరూ కూడా అఫీషియల్ ప్రకటన చేయకపోవటం విశేషం.

అయతే తనకు మాత్రం ఆ సమాచారం అందిందని, ఓ స్టార్ ప్రోడ్యూసర్ తనను అప్రోచ్ అయినట్లు స్వయంగా సానియానే చెబుతోంది. మరీ సినిమాలో మీరే స్వయంగా నటిస్తారా? అన్న పశ్నకు నవ్వి నో అనే చెప్పేసింది. నా బయోపిక్ లో ఎమోషన్లు వేరే వాళ్ల రూపంలోనే చూసుకోవాలని ఆరాటపడుతున్నా అని చెబుతోంది. మరి అందుకు ఫర్ ఫెక్ట్ ఛాయిస్ ఎవరన్నదానికి కూడా ఆన్సర్ ఇచ్చేసింది.

ఇంకెవరూ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పరిణితీ చోప్రానేనంట. "పరిణితిని ఫస్ట్ టైం కలిసినప్పుడే నా గుండెకు చేరువైపోయింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయాం. నా ప్రతీ విషయాన్ని తనతో షేర్ చేసుకుంటా. ఇద్దరం కలిసి ది బెస్ట్ మూమెంట్స్ ఎన్నో గడిపాం. మా ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే. అందుకే నా బయోపిక్ కు బెస్ట్ ఛాయిస్ ఆమెనే అని చెబుతోంది సానియా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sania Mirza  Biopic  Parineeti Chopra  

Other Articles

Today on Telugu Wishesh