బాలయ్య చెప్పులు కూడా విప్పుకోలేడా? | Balayya in spot as aide carries her slippers

Balayya slippers carrying controversy

Balakrishna, Balayya Slipper Controversy, Balayya 102 Movie Opening, Balayya Controversy, Balayya Sandals Removie, Balayya 102, Tollywood Actor Slippers Carrying, MLA Balakrishna Slippers Carry, MLA Balakrishna Sandals Controversy, Balayya Aide Slipper Removing, Actor Balakrishna Attitude, Balayya Attitude, Tollywood Controversies, Balayya Sandals, balayya slap Staff Sandals, Balayya Slap Staff Slippers

Tollywood Actor Balakrishna's Staff Seen Carrying his Sandals. The Scene Caught at his 102 movie launch shoot.

చెప్పులు మోయించిన బాలయ్యపై విమర్శలు

Posted: 08/03/2017 12:37 PM IST
Balayya slippers carrying controversy

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలకృష్ణది చాలా ప్రత్యేకమైన శైలి. తరచూ తన సినిమా షూటింగ్ సెట్స్ లో అడ్జస్ట్ అయిపోవటం ఈ మధ్య బాగా చూస్తున్నాం. మిగతా కాస్ట్ వాళ్లతో విమానాల్లో ప్రయాణించటం, టెక్నీషియన్లు తినే తిండే తాను తినటం, అవసరమైతే ఓపెన్ ఏరియాల్లోనే సేద తీరటం బాలయ్యకు బాగా అలవాటైపోయింది.

ఒకప్పుడు సెట్స్ లో తరచూ కోప్పడుతూ ఉండేవాడని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పద్ధతి మార్చుకుని చాలా క్లోజ్ గా ఉంటున్నాడని ఇలా పలువురు బాలయ్య యాటిట్యూడ్ ను పొగుడుతూ వచ్చారు. అయితే తన కొత్త సినిమా ఓపెనింగ్ సందర్భంగా జరిగిన ఓ విషయంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ముహుర్తపు షాట్ సన్నివేశం చిత్రీకరించే సమయంలో తన చెప్పులు వేరే వ్యక్తితో మోయించటం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో బాలయ్య 102వ చిత్రం ఇవాళ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సీనియర్ హీరో చెప్పులను వ్యక్తిగత సహాయకుడు తీసి, పక్కకు తీసుకెళ్లటం అక్కడున్న కెమెరామెన్ లు ఫోటో తీశారు. కనీసం తన చెప్పులు కూడా తీసుకోలేని స్టేజీలో బాలయ్య ఉన్నాడా? పైగా ఎమ్మెల్యే కూడా... అంటూ కొందరు మండిపడుతున్నారు. ఒకప్పుడు కొందరు సీనియర్ హీరోలు ఇదే రీతిలో యాటిట్యూడ్ ను చూపించేవారని, అది కనుమరుగైపోయిందన్న టైంలో ఇప్పుడు ఇది వెలుగుచూడటంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమకు తెలీకుండానే కెమెరా కంటికి చిక్కేయటం, ఆపై తీవ్ర విమర్శలు ఎదుర్కోవటం మన సెలబ్రిటీలకు ఈ మధ్య పరిపాటిగా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Actor Balakrishna  Slippers Carrying  Controversy  

Other Articles