Nani Not Rajamouli's Next Movie Hero

Nani reaction on movie with rajamouli

Nani, Nani Ninnu Kori Interview, Nani Rajamouli Movie, Nani Baahubali Director, Nani New Movies, Hero Nani Condemns Rumour, Nani in Rajamouli Mahabharata, Natural Star Rajamouli

Actor Nani Condemns Rumour that he is not in Baahubali's Director Rajamouli Next Hero. There is no Chance for That Nani Busy with back to back movies.

రాజమౌళితో సినిమా అంటే నాని రియాక్షన్

Posted: 07/06/2017 01:39 PM IST
Nani reaction on movie with rajamouli

దర్శకధీరుడు రాజమౌళితో సినిమా కోసం స్టార్ హీరోలంతా క్యూ కట్టుకుని మరీ కూర్చున్నారు. అలాంటిది జక్కన్న మైండ్ లో మాత్రం ఎవరున్నారన్నది మాత్రం ఇప్పటికైతే సస్పెన్సే. అయితే తన ఫెవరెట్ అంటే మాత్రం ఎప్పుడూ ఇద్దరి పేర్లే చెబుతుంటాడు జక్కన్న. అందులో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరోకరు నేచురల్ స్టార్ నాని.

దీంతో బాహుబలి నెక్స్ట్ ప్రాజెక్టు ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరితో ఉంటుందంటూ పుకార్లు రేగాయి. ఎన్టీఆర్ వరుసగా రెండు సినిమాలతో బిజీగా మారిపోయాడు. నాని ఇప్పుడు ఎంసీఏ షూటింగ్ ను త్వరగతిన పూర్తి చేసే పనిలో పడ్డాడు. దీంతో తర్వాతి సినిమా నానితోనేనని కన్పర్మ్ చేసేశాయి కొన్ని వెబ్ సైట్లు. దీనిపై నిన్ను కోరి ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చేశాడు. రాజమౌళి తో సినిమానా? అంటూ నవ్వేశాడు.

తనకు అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని, రాజమౌళి కోసం బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లు వెయిట్ చేస్తుంటే.. తనకు అంత ఛాన్స్ ఎక్కడుంటుందంటూ కామెంట్ చేశాడు. ఒకవేళ మహాభారతం లాంటి భారీ సినిమా తీస్తే అందులో ఏదో ఒక రోల్ లో ఇరికిస్తాడేమో గానీ, సోలో హీరో సినిమా తీస్తే మాత్రం కష్టమయ్యే పనే కదా అంటూ తన స్టైల్ క్లారిటీ ఇచ్చేశాడు నాని. అఫ్ కోర్స్ తన తర్వాతి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా అని చెప్పినప్పటికీ ఎలాంటి జోనరో ఇంత వరకు జక్కన్నకే క్లారిటీ లేకుండా పోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Rajamouli  Baahubali Movie  

Other Articles