Nakshatram Producer Insulted by Anchor at Audio Event

Nakshatram producer mike taken away forcefully

Anchor Udhaya Bhanu, Udhaya Bhanu, Udhaya Bhanu Over Action, Udhaya Bhanu Insult, Producer Srinivasulu, Producer Srinivasulu Udhaya Bhanu, Krishna Vamshi Producer Insulted, Udhaya Bhanu Re Entry, Udhaya Bhanu Insult

Anchor Udhaya Bhanu over action at Nakshatram Audio. Producer Srinivasulu's mike taken away forcefully.

యాంకర్ ఓవరాక్షన్.. నక్షత్రం నిర్మాత మైక్ లాక్కుంది

Posted: 07/06/2017 02:27 PM IST
Nakshatram producer mike taken away forcefully

తెలుగులో బుల్లితెరపై హాట్ యాంకరింగ్ బీజం వేసింది ఒక రకంగా ఉదయభానే అని చెప్పుకోవాలి. అప్పటిదాకా పద్ధతిగా సాగిపోతున్న యాంకర్ల మధ్యలోకి దూసుకొచ్చి గళ గళ మాటలతో, ట్రెండీ డ్రెస్సులతో ఓ ఊపు ఉపేసింది. దశాబ్దంపైగానే కెరీర్ ను కొనసాగించి ఆపై పెళ్లయ్యాక ప్రోఫెషన్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు నక్షత్రం ఆడియో లాంఛ్ ఈవెంట్ లో మెరిసి బ్యాక్ టూ పెవిలియన్ అంటూ హింట్ ఇచ్చేసింది.

అయితే ఆకట్టుకునే మాటకారి తనం లేదంటే స్కిన్ షో ఈ రెండింటి మధ్యే కొనసాగుతన్న ట్రెండ్ లో భాను యాంకరింగ్ చాలా మందికి ఇరిటేటింగ్ నే కలిగించిందని చెప్పుకొవాలి. ఆమె మాట్లాడుతున్న సేపు అభిమానులే కాదు, చిత్ర యూనిట్ మొహంలో కూడా ఒకరకమైన డల్ నెస్ ఫీలింగ్ కనిపించింది. ఇది చాలదన్నట్లు చిత్ర నిర్మాత శ్రీనివాసులు స్పీచ్ ఇస్తున్న టైంలో ఆమె చేసిన సీన్ కాస్త ఓవర్ అయ్యిందనే చెప్పుకోవాలి. సినిమాకు నిర్మాత, పైగా ఆ ఈవెంట్ కు అంతేసి ఖర్చు పెట్టి చేసింది ఆయనే అన్న విషయం మరిచి మరీ ప్రవర్తించిందని అక్కడున్నవారంతా గొణుక్కున్నారు కూడా.

వీడియో కోసం క్లిక్ చేయండి

సినిమాకు తాను పడ్డ కష్టం గురించి, కృష్ణ వంశీ గురించి నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ సుదీర్ఘమైన ప్రసంగమే ఇచ్చాడు. అయితే ఇండస్ట్రీకి కొత్త వ్యక్తి కావటంతో తడబడుతూ ఎగ్జయిట్ అవుతూ మరీ మాట్లాడటం తో అది కాస్త బోరింగ్ స్పీచ్ గా మారింది. దీంతో మధ్యలో కలగజేసుకున్న ఉదయభాను మీరు యాంకర్ కానని మాటివ్వండి అంటూ నోటి దగ్గరి నుంచి మైక్ లాగేసుకుంది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేయటంతో ఆయన స్టేజీ దిగివెళ్లిపోయాడు. యాంకరింగ్ లో కూడా మార్పులు వచ్చాయన్న విషయం భాను గ్రహిస్తే మంచిదేమో కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Udhaya Bhanu  Nakshatram Audio  Producer Srinivasulu  

Other Articles