Aamir's Dangal Not Made 2,000 Crore Collections

Dangal not collected 2000 crores

Dangal, Dangal Movie, Dangal 2000 Crores, Aamir Khan Dangal Collections, Dangal China Fake Collections, China Dangal Collections, Dangal Collections, Dangal China Real Collections, Dangal Forbes Fake Collections

Aamir Khan's Dangal 2,000 Crore Collections news not true."We have been reading a lot of reports saying that Dangal has crossed 2,000 crore worldwide. Just to set the record straight, we want to clarify that Dangal's official worldwide gross collection figure as of Thursday is 1,864 crore," said Aamir's spokesperson.

దంగల్ 2000 కోట్లు ఉత్త ముచ్చటే!

Posted: 07/04/2017 11:56 AM IST
Dangal not collected 2000 crores

ఇండియాలో నోట్ల రద్దు హడావుడిలో రిలీజ్ అయి ఉండి ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమీర్ ఖాన్ దంగల్ రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు 800 కోట్ల దాకా వసూలు చేసిన ఈ చిత్రం తర్వాత చైనాలో రిలీజ్ అయ్యి వండర్స్ క్రియేట్ చేయటం తెలిసిందే. విదేశంలో ఏకంగా వెయ్యి కోట్లు సాధించిన ఇండియన్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

అయితే ఈ క్రమంలో ఓ ఫేక్ రికార్డు దంగల్ ఖాతాలో అప్పుడే పడిపోవటం విశేషం. దంగల్ గత వారమే 2000 కోట్ల క్లబ్ లో చేరిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అంతర్జాతీయ మ్యాగ్జైన్ ఫోర్భ్ కూడా ఈ విషయంలో లెక్కలు చూసుకోకుండా తప్పుడు ప్రకటన జారీ చేసింది. దీంతో మన మీడియా కూడా అమీర్ దంగల్ తొలి 2000 కోట్ల ఇండియన్ మూవీ అంటూ బ్యానర్ల హెడ్డింగ్ లతో రాసిపడేశాయి. అయితే దంగల్ సినిమా ఇంకా 2,000 కోట్ల క్లబ్ లో చేరలేదంట.

గత వారం గురువారానికి దంగల్‌ 1,864 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిందని అఫీషియల్ లెక్కలు చెబుతున్నాయి. సువాయి జియావో బాబా పేరుతో రిలీజ్ అయిన దంగల్ కు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అధ్యక్షుడు జి జిన్ పింగ్ కూడా సినిమాను చూసి మన ప్రధాని మోదీ వద్ద అద్భుతంగా ఉందని ప్రస్తావించాడంట. ప్రస్తుతానికైతే లెక్కల్లో ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. త్వరలోనే దంగల్ రెండు వేల కోట్ల ఫీట్ సాధించే అవకాశాలు ఉన్నాయని అమీర్ ఖాన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamri Khan  Dangal Movie  2000 Crores  Fake News  

Other Articles