పూజా కార్యక్రమాలు మొదలుపెట్టక ముందే ఏకంగా పటేల్ సర్ అంటూ టీజర్ తోనే షాకిచ్చాడు జగపతి బాబు అలియాస్ జగ్గూ భాయ్. శరవేగంగా షూటింగ్ జరిపేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కు కూడా రెడీ అయిందంటూ మరో ట్విస్ట్ ఇచ్చేశాడు. జూలై 14న సినిమా రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా టీజర్ తో అనౌన్స్ చేసేసింది చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం.
ఇక ప్రీ టీజర్, ఫస్ట్ లుక్ తో రగ్గ్ గాయ్ గా కనిపించిన ఈ సీనియర్ నటుడు ఇందులోనూ అదే కొనసాగించాడు. బుల్లెట్ పై ఓ చిన్న పాపను వెంటేసుకుని రౌడీలను తరమటం, పబ్ లో పటేల్ సార్ సాంగ్.. థీమ్. తన చుట్టూ చేరిన రౌడీలను ఖాతరు చేయకుండా వన్ మోర్ పెగ్ ప్లీజ్ అంటూ డైలాగ్ చెప్పటం, అదనంగా క్లీన్ షేవ్ తో ఉన్న జగ్గూభాయ్ హీరోయిన్ పద్మప్రియ తో రొమాంటిక్ కోణాన్ని కూడా ఇందులో చూపించేశాడు.
ఇక చివర్లో జస్ట్ కాల్ మీ సర్ అంటూ చెప్పే డైలాగ్ తో టీజర్ ను ముగించేశారు. వాసు పరిమి అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది. విలనిజంతో రప్పాడించేస్తున్న ఈ సీనియర్ నటుడికి ఈ హీరో వేషాలు ఏ మాత్రం ఫ్లస్ అవుతాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more